Home /News /telangana /

NALGONDA MINISTER HARISH RAO AS THE IN CHARGE OF MUNUGODU BY ELECTIONS DOUBT OVER TRS VICTORY AND DEFEAT SNR

Telangana : మునుగోడులో మునుగుడో..? తేలుడో ..? మళ్లీ ఆ మంత్రిపైనే భారమంతా

harishrao(file photo)

harishrao(file photo)

TRS | Harish Rao: తెలంగాణలో ఉపఎన్నిక వచ్చిందంటే టీఆర్ఎస్‌కి నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోవడం కత్తి మీద సాములా తయారైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. గెలిపించే బాధ్యతల్ని ఆయనకి అప్పగిస్తున్నప్పటికి ఓటమి తప్పడం లేదు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
తెలంగాణ(Telangana)లో ఉపఎన్నిక వచ్చిందంటే టీఆర్ఎస్‌(TRS)కి నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకోవడం కత్తి మీద సాములా తయారైంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క కొడంగల్(Kodangal),నాగార్జునసాగర్‌(Nagarjunasagar), మినహా ఎక్కడా వన్‌ సైడెడ్‌గా గెలిచిన దాఖలాలు లేవు. పార్టీలో ట్రబుల్‌ షూటర్, సక్సెస్‌ఫుల్‌ లీడర్‌గా పేరున్న మంత్రి(Minister)కే ప్రతి ఉపఎన్నికల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించినప్పటికి ప్రయోజనం ఆశించిన స్ధాయిలో రావడం లేదు. ఇప్పటి వరకు రెండు సార్లు బై పోల్ రిజల్స్ట్ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వచ్చినప్పటికి మూడో సారి కూడా మునుగోడు(Munugode)బాధ్యతలను ఆయనకే అప్పగించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Jaggareddy | Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన అదే .. నవంబర్‌ 5న ముహుర్తం ఫిక్స్మునుగోడులో మునగుడో..? తేలుడో ..?
తెలంగాణలో ఉపఎన్నిక వచ్చిందంటే చాలు అన్నీ రాజకీయ పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్‌ పార్టీకి మాత్రం ఇదొక సంక్లిష్టమైన సమస్యగా తయారైంది. చూడటానికి బలమైన నాయకత్వం, కావాల్సినంత క్యాడర్ ఉన్నప్పటికి ప్రత్యర్ధి పార్టీలు సరైన అభ్యర్ధిని నిలబెట్టడం, పోలింగ్‌ టైమ్‌కి పవనాలు వ్యతిరేకంగా వీస్తూ ఉండటంతో టీఆర్ఎస్‌కి ఉపఎన్నికలు ఓ చేదుఅనుభవంగా మిగిలిపోతున్నాయి. మొన్న దుబ్బాక, నిన్న హుజురాబాద్‌, నేడు మునుగోడులో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ అధిష్టానం మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకి అప్పగించింది. అయితే మునుగోడు కాంగ్రెస్‌ సిట్టింగ్ ప్లేసు కావడం, అక్కడి నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి బలమైన నాయకుడు కావడంతో పాటు బీజేపీ తరపున పోటీ చేస్తుండటంతో ఇక్కడ టీఆర్ఎస్‌ గెలుపు ఒక విధంగా కష్టమని తెలుస్తోంది. అందుకే పార్టీలో హరీష్‌రావు కంటే బలమైన, సమర్ధవంతమైన నాయకుడు లేరని భావించే ఈబాధ్యతను ఆయనకు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.మంత్రి గారు మూడో సారి ఏం చేస్తారో..
అయితే మంత్రి హరీష్‌రావు స్ట్రాంగ్‌ లీడర్‌ అనే విషయం అందరికి తెలిసినప్పటికి...గతంలో జరిగిన పరిణామాలు, ఉపఎన్నికల ఫలితాల్ని తిరగేసి చూస్తే ...ఈసారి మునుగోడులో ఆయన డైరెక్షన్‌లో టీఆర్ఎస్‌ గెలవడం ఎంత వరకు గ్యారెంటీ అనే విషయాన్ని మాత్రం సొంత పార్టీ నేతలే చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే గతంలో దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్‌రావుని నిలబెడితే ...గట్టి పోటీ ఇచ్చినప్పటికి టీఆర్ఎస్‌ ఓడింది. ఆ తర్వాత జరిగిన హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్ అయింది. ఈటల రాజేందర్‌ రూపంలో టీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు చోట్ల హరీష్‌రావు టీఆర్ఎస్‌ అభ్యర్ధుల్ని గెలిపించలేకపోయారనే టాక్‌ ఉంది. అలాంటి వ్యక్తికే మరోసారి మునుగోడు బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే వరుసగా మూడోసారి కూడా బీజేపీ గెలిచి హరీష్‌రావుకి ఉపఎన్నికల ఓటమిలో హ్యాట్రిక్ ఇస్తుందా అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.

Students Suicide : ఔను వాళ్లిద్దరూ చనిపోయారు .. అన్నాచెల్లెలికి ఆ సంబంధం అంటగట్టడం వల్లేకత్తి మీద సామే ..
మునగోడు బైపోల్ విషయంలో ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్‌ నేతలు, నాయకులతో భేటీ అయ్యారు. హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించినట్లుగా ప్రకటించారు. అంతే కాదు పార్టీ అభ్యర్ధి పేరు ప్రకటించే వరకు ఎవరూ టంగ్ స్లిప్ కావద్దని కూడా గులాబీ బాస్‌ నేతలకు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 21న బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు ముందే టీఆర్ఎస్‌ పార్టీ బహిరంగ సభ నిర్వహించి క్యాడర్,ప్రజల్లో టీఆర్ఎస్‌ సత్తా ఏంటో చూపించాలని విషయాన్ని మరీ మరీ చెప్పినట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికి ఉపఎన్నిక జరగబోయే మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ఫోర్స్‌ని తట్టుకొని నిలబడే బలమైన అభ్యర్ధి ఎవరనే భూతద్దం వేసుకొని వెదుకుతోంది టీఆర్ఎస్‌ పార్టీ, మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఉపఎన్నికను మంత్రి హరీష్‌రావు గెలిపించి తన చర్మిష్మాను కాపాడుకుంటారా లేక సీటు చేజార్చుకొని హ్యాట్రిక్ ఓటమిని తన ఖాతాలో వేసుకుంటారో చూడాలని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Munugodu By Election, Telangana Politics

తదుపరి వార్తలు