హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: నీటిసంపులో పడి బాలుడు మృతి...

Nalgonda: నీటిసంపులో పడి బాలుడు మృతి...

nalgonda crime news

nalgonda crime news

నీటి సంపులో పడి బాలుడు మృతి, విద్యుత్ తీగలు తగిలి మెకానిక్ మృతి, ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

(Nagaraju, News 18, Nalgonda)

నార్కట్ పల్లి: పోలంలో బోరు మరమ్మత్తు చేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతంతో మెకానిక్ మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం అవురవాణి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. అవురవాణి గ్రామానికి చెందిన ఇద్దయ్య, మోటార్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉపేందర్ అనే రైతుకు చెందిన వ్యవసాయ బోరు మరమ్మత్తు గురవగా... ఇద్దయ్య, ఉపేందర్ రిపేర్ చేసేందుకు వెళ్లారు. ఈక్రమంలో బోరు ఇనుప పైపులను పైకి తీస్తుండగా... పైపు పైన ఉన్న విద్యుత్ వైర్లను తాకింది. ఇద్దయ్య పైపును అలాగే పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యి అక్కడిక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి ఉపేందర్‌ను కర్రసాయంతో తోసేశాడు. దీంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నార్కట్ పల్లిలో చోటుచేసుకుంది. నార్కట్ పల్లికి చెందిన బైరోజు లక్ష్మణ్ చారి, దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలు వెంటాడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మణ్ ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

నీటిసంపులో పడి బాలుడి మృతి: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బాలుడి మృతి చెందిన ఘటన వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కప్పెర దుర్గయ్య, లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మండలంలో వరి నాటు పనులు మొదలు కావడంతో కూలి నిమిత్తం లక్ష్మి కొన్నిరోజుల నుంచి చిట్యాలలో ఉంటుంది. ముగ్గురు పిల్లలను భర్తకు అప్పజెప్పిన లక్ష్మి చిట్యాలకు వెళ్లారు. ఆదివారం పిల్లలను ఇంట్లో వదిలి కూలీపనులకు వెళ్లాడు దుర్గయ్య. ఈ క్రమంలో కుమారుడు పాల్ రాజ్.. ఆడుకుంటూ ఇంటి ముందున్న నీటి సంపులో పడగా ఎవరూ గమనించకపోవడంతో మృతిచెందాడు. కాసేపటికి పెద్ద కుమార్తె సింధూర ఇంట్లో పాత్రలను కడిగేందుకు సంపు వద్దగా వెళ్లగా పాల్ రాజ్ మృతదేహం కనిపించింది. ఆమె కేకలు వేయడంతో.. స్థానికులు వచ్చి బాలుడి మృతదేహాన్ని బయటికి తీశారు. విగతాజీవిగా పడిఉన్న కుమారున్ని చూసి తల్లి రోదిస్తున్న దృశ్యాలు అక్కడివారిని కలిచివేసింది. ఎమ్మెల్యే భాస్కర్ రావు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ. 10 వేలు ఆర్థిక సహయం అందించారు.

First published:

Tags: Crime news, Local News, Nalgonda, Telangana

ఉత్తమ కథలు