హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu : అయోమయంలో హస్తం గుర్తు పార్టీ .. మునుగోడులో కాళ్లు పట్టుకొని ఓటేయమని కోరుతున్న కాంగ్రెస్ నాయకులు

Munugodu : అయోమయంలో హస్తం గుర్తు పార్టీ .. మునుగోడులో కాళ్లు పట్టుకొని ఓటేయమని కోరుతున్న కాంగ్రెస్ నాయకులు

(Photo Credit:Face Book)

(Photo Credit:Face Book)

Munugodu: మునుగోడు ఉపఎన్నికల్లో హస్తం గుర్తు పార్టీ అభ్యర్ధి పరిస్థితి అయోమయంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలని ముందు నుంచి ఆరాటపడిన నేతలంతా ఇప్పుడు చడి, చప్పుడు చేయడం లేదు. దీంతో కింది స్థాయి కార్యకర్తలతో ఓటర్ల కాళ్లు పట్టిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

మునుగోడు(Munugodu)ఉపఎన్నికల్లో హస్తం గుర్తు పార్టీ అభ్యర్ధి పరిస్థితి అయోమయంగా మారింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలని ముందు నుంచి ఆరాటపడిన నేతలంతా ఇప్పుడు చడి, చప్పుడు చేయడం లేదు. ప్రచారానికి వెళ్లకుండా సైలెంట్‌గా సైడ్ అయిపోయారు. చివరకు కాంగ్రెస్(Congress)పార్టీ నేతలు ఏ స్థాయికి దిగజారారంటే మునుగోడు ఓటర్లను కాళ్లు పట్టుకొని ఓట్లు అడిగే ధీనస్థితికి చేరుకున్నారు. అయితే ఆ పని కూడా నేతలు చేయడం లేదు. ఎన్‌ఎస్‌యూఐ (NSUI)సభ్యులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రచారం బాధ్యతలను అప్పగించి చేతులు దులుపుకున్నారు. పోటీలో నిలబడిన అభ్యర్దికి ప్రచారం చేసుకోవడం తప్పదు కాబట్టి పాల్వాయి స్రవంతి(Palvai sravanthi)మాత్రం డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తోంది. మునుగోడు ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌ కాళ్లు పట్టుకొని మీ ఓటు హస్తం గుర్తుకే వేయండి అని అడుగుతున్న వీడియో(Video)లు మాత్రం విస్తృతంగా వైరల్(Viral)అవుతున్నాయి. వాటిపై జనం సెటైర్లు కూడా వేసుకుంటున్నారు.

TS RTC : టీఎస్‌ ఆర్టీసీలో వీఆర్ఎస్‌ దరఖాస్తుల పరిశీలన .. పదవీ విరమణకు యాజమాన్యం అనుమతి

కాంగ్రెస్‌ పార్టీ పుట్టి మునిగేనా ..

మునుగోడులో రెండు ప్రధాన పార్టీలతో పాటు కాంగ్రెస్‌ పోటీలో నిలబడటం అడ కత్తెరలో పోక వక్కలా మారింది. అంతే కాకుండా అటు రేవంత్‌రెడ్డి సూచించిన వ్యక్తిని కాకుండా ..కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లుగా స్థానికురాలు, పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కుమార్తె అయినటువంటి పాల్వాయి స్రవంతిని అభ్యర్దిగా నిలబెట్టింది. ఆమెను గెలిపించే బాధ్యత పార్టీలోని కీలక నేతలకు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్ . ప్రచారం నుంచి గెలిచే వరకూ వెన్నంటే ఉండాలని ఆదేశించింది. కాని కాంగ్రెస్ నేతల తీరు అందుకు భిన్నంగా ఉంది. ప్రచారంలో ముందుండాల్సిన నేతలంతా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్నిక, రాహుల్ జోడో యాత్ర పేరుతో హైదరాబాద్‌లో తిష్టవేయడంతో పాల్వాయి స్రవంతి ఒక్కరే ప్రచారం చేసుకుంటున్నారు.

హస్తం నేతలెక్కడా ..

అంతే కాదు ఓవైపు బీజేపీ నేతలు సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్‌ అభ్యర్ధి తరపున సుమారు 35మంది కీలక నేతలు నియోజకవర్గంలో మకాం వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ వినూత్న ప్రచారం చేస్తోంది. ఇదివరకే మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పాల్వాయి స్రవంతి మహిళలకు గాజులు తొడిగి, బొట్టు పెడుతూ ఓట్లడుగుతున్నారు. ఇదే క్రమంలో ఎన్ఎస్​యూఐ విభాగం లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కే కార్యక్రమాన్ని ఆదివారం చౌటుప్పుల్ మున్సిపాలిటీలో మొదలుపెట్టింది.

లక్ష మంది కాళ్లు మొక్కే కార్యక్రమం..

ఆరు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో కలిపి 8 వందల మంది ఎన్ఎస్​యూఐ కార్యకర్తలు 40 వేల గడపలకు వెళ్లి లక్ష మంది ఓటర్ల కాళ్లు మొక్కుతున్నారు. ఎన్ఎస్​యూఐ స్టేట్​ ప్రెసిడెంట్​ బల్మూరి వెంకట్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. వాస్తవంగా మునుగోడు ప్రచార బాధ్యతల్ని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్‌కు అప్పగిస్తే వాళ్లెవరూ ప్రజల దగ్గరకు వెళ్లకుండా యూత్ కాంగ్రెస్ నాయకుల్ని పంపి కాళ్లు పట్టుకోమనడం చూసి స్థానికులు నవ్వుకుంటున్నారు.

Boora Narsaiah Goud: TRS మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ చేరుతోంది ఆ పార్టీలోనే .. ఆ రోజే కండువా మార్చుకోవడం ఫిక్స్

పెరుగుతున్న సింపతీ..

పొలిటికల్ సిస్ట్యూవేషన్ ఈవిధంగా ఉంటే బరిలో దిగిన పాల్వాయి స్రవంతి మాత్రం ప్రచారంలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. మన మునుగోడు మన కాంగ్రెస్‌ పేరుతో తన శక్తి మేరకు ప్రతి మండలం, గ్రామంలో పర్యటించి ఓట్లడుగుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలు కాంగ్రెస్‌ అభ్యర్దికి డిపాజిట్లు కూడా రావనే అంచనాలో ఉన్నారు. కాని స్థానిక పరిస్థితులు చూస్తుంటే ఆ రెండు పార్టీలకు హ్యాండిచ్చి సంపితీతో స్రవంతికి ఓటేసి గెలిపిస్తారనే టాక్‌ కూడా వినిపిస్తోంది. చూడాలి మునుగోడు ఓటర్ల తీర్పు ఏవిధంగా ఉంటుందో.

First published:

Tags: Congress ts, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు