మునుగోడు (Munugodu)ఉపఎన్నిక పోటీ మొదలైన నాటి నుంచి నేటి వరకు ప్రచారంలో, కనీసం కార్యకర్తల సమావేశంలో పాల్గొనని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆమెకు మాటిచ్చారు. కాంగ్రెస్(Congress) అభ్యర్దిగా నిలబడిన పాల్వాయి స్రవంతి(Palvai sravanthi)తరపున ప్రచారం చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అందరూ ఉండి ఒంటరిగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ది పాల్వాయి స్రవంతి తన తరపున మునుగోడులో ప్రచారంలో పాల్గొనాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) చేతులు జోడించి వేడుకున్నారు. సోమవారం గాంధీభవన్(Gandhi Bhavan)లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చిన సందర్భంలో ఈ ఇద్దరు నేతలు సంభాషించుకున్నట్లుగా గాంధీభవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే మునుగోడు ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొనని..తాను ఓ హోంగార్డునని ..అక్కడికి డీఎస్పీలు మాత్రమే వస్తారని సంచలన కామెంట్స్ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్వాయి స్రవంతికి మాటిచ్చారు.
మాట ప్రకారం వస్తారా ..?
తెలంగాణ కాంగ్రెస్‌లో అందరి కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ప్రస్తుతం పార్టీ స్టార్ క్యాంపెయిన్‌గా బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి పెద్దగా జనంలో తిరిగిన పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన తన సోదరుడు బీజేపీలో చేరడంతో మునుగోడు ఉపఎన్నిక రావడంతో అందరి చూపు కోమటిరెడ్డిపైనే పడింది. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక విషయంలో టీపీసీసీ చీఫ్‌తో పోటీ పడి పంతం నెగ్గించుకున్నప్పటికి ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటున్నారు. ఒకానొక సందర్బంలో తాను ప్రచారం చేయనని కూడా చెప్పారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు సమస్యాత్మకంగా మారింది. అందుకే సోమవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన సమయంలో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీలో ఉన్న పాల్వాయి స్రవంతి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలుసుకుని మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేయాలని రెండు చేతులు జోడించి వేడుకున్నారు.
ఉట్టి మాటేనా..!
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్వాయి స్రవంతిని ఆశీర్యదించారు. మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానని ఆమెకు హామీ ఇవ్వడంతో అక్కడే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యపోయారు. అయితే అదే సందర్భంలో పార్టీ సీనియర్ నేత వీహెచ్ సైతం కోమటిరెడ్డిని ప్రచారం చేయాలని కోరడం కూడా జరిగింది. అయితే కాంగ్రెస్ నేతలు తనను అవమానించారని అందుకే ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. అయితే తాను నిబద్ధతతో కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నట్లుగా అంతకు ముందు రోజు మీడియాకు చెప్పిన కోమటిరెడ్డి ..పాల్వాయి స్రవంతికి ఇచ్చిన మాట ప్రకారం మునుగోడు ప్రచారంలో పాల్గొంటారా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Komatireddy venkat reddy, Munugode Bypoll, Telangana Politics