Komatireddy sensational comments on party change | ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata reddy) పార్టీ మార్పుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఇక ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల ముందు డిసైడ్ అవుతానని వెంకటరెడ్డి (Komatireddy Venkata reddy) చెప్పుకొచ్చారు. ఎన్నికల వరకు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడతానని అన్నారు. అలాగే YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల ( Ys Sharmila) ఘటనపై ఆయన స్పందించారు. షర్మిల (Sharmila) ఘటన దురదృష్టకరం దీనిని అందరం ఖండించాలని అన్నారు. నేడు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న వెంకన్న..
కాగా టీపీసీసీ చీఫ్ పదవి అందించిన వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata reddy) ఒకరు. అయితే అనూహ్యంగా రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించడంపై కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఎన్నో రోజుల నుండి పార్టీలో ఉన్న వారికి కాకుండా రేవంత్ కు బాధ్యతలు అప్పగించడంపై కోమటిరెడ్డి అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఇక అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీతో ఎడమొహం పెడమొహంగా ఉంటూ హైకమాండ్ కు తలనొప్పిగా మారారు.
బీజేపీలోకి కోమటిరెడ్డి సోదరుడు..
అయితే ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata reddy) మాత్రం కాంగ్రెస్ తరపున ప్రచారం చేయలేదు. పైగా ఆ సమయంలో ఆయన విదేశాలకు టూర్ కు వెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆడియోలు బయటకు వచ్చాయి. తన తమ్ముడికి ఓటేయాలని, పార్టీని చూడొద్దని కోమటిరెడ్డి (Komatireddy Venkata reddy) వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అధిష్టానం కోమటిరెడ్డికి రెండు సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనికి కోమటిరెడ్డి ఆ వ్యాఖ్యలు తనవి కాదని మార్ఫింగ్ చేశారని ఆయన వివరణ ఇచ్చారు.
ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?
అయితే ఎన్నికలకు ముందు పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata reddy) చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. సమయం దొరికినప్పుడల్లా కోమటిరెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారాలనుకుంటే బీజేపీ వైపే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata reddy) ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Hyderabad, Komatireddy venkat reddy, Nalgonda, Telangana