హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kcr: జాతీయ పార్టీతో పాటు మరో కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్..అదేంటంటే?

Kcr: జాతీయ పార్టీతో పాటు మరో కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్..అదేంటంటే?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో TRS మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో TRS మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లతో సహా 283 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటుకు గల కారణాలు బలోపేతానికి చేయాల్సిన కార్యక్రమాలను కేసీఆర్ వివరించనున్నట్టు తెలుస్తుంది. అనంతరం మధ్యాహ్నం 1.19 గంటలకు కొత్త పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఇక ఆ తరువాత సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన చేయనున్నారు. మునుగోడు బై ఎలక్షన్ లో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. మునుగోడు అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది.

    Published by:Rajasekhar Konda
    First published:

    Tags: CM KCR

    ఉత్తమ కథలు