మునుగోడు(Munugodu)లో ఉపఎన్నిక ఉట్టిగానే రాలేదు. అవసరం లేకుండా ఒక వ్యక్తి ప్రయోజనం కోసం వచ్చిందన్నారు. మునుగోడు ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి నీరిచ్చే బాధ్యత తనదన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఏ ప్రధాని చేయని దుర్మార్గం నరేంద్ర మోదీ(Narendra Modi)చేశారని తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) చెప్పారు. చేనేత కార్మికులపై జీఎస్టీ విధించారు. ఇప్పుడు ఆ చేనేత కార్మికులనే ఓట్లు అడుగుతున్నారు బీజేపీ(BJP) నేతలు. అందుకే మునుగోడులోని చేనేత కార్మికులు బీజేపీ నేతలకు బుద్ది చెప్పాలన్నారు. రెండు సార్లు ప్రధానిగా చేసిన మోదీ ఎందుకు ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరులో బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ యుద్ధం చేయాలన్నారు. చేనేత కార్మికులు ఓటు వేసే ముందు ఆలోచించాలన్నారు.
ఆత్మగౌరవాన్ని కొనేందుకు వచ్చారు..
ఢిల్లీ బ్రోకర్ గాళ్లు కొందరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని చెప్పారు సీఎం. తెలంగాణ ఆత్మగౌరవం అమ్ముడుపోయేది కాదని ఆ నలుగురు ఎమ్మెల్యేలు చెప్పుతో కొట్టినట్లుగా చెప్పారు. వంద కోట్లకు నలుగురు ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చిన వాళ్లెవరో తెలియాలన్నారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో విచారణ జరగాలన్నారు కేసీఆర్ .75ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎమ్మెల్యేలను అంగడిలో పశువుల్లా కొనాలని చూస్తున్న బీజేపీని నమ్మవద్దన్నారు.
చేనేత మీద జీఎస్టీ విధించిన నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. - టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్#VoteForCar #MunugodeWithTRS pic.twitter.com/jnhv4IcqSJ
— TRS Party (@trspartyonline) October 30, 2022
మీటర్ల వెనుక మోసం దాగి ఉంది..
విద్యుత్ సంస్కరణల పేరుతో బీజేపీ పేదలను కొట్టి కార్పొరేట్ గద్దలకు దోచి పెట్టాలని చూస్తోందన్నారు. ఈ విద్యుత్ డిస్కాంల వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. మీటర్లు పెడతామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ఓటర్లే మీటర్ పెట్టాలన్నారు. భరించే వాళ్లు ఉన్నంత వరకు వేధించే వాళ్లు, దోచుకునే వాళ్లు పుడుతూనే ఉంటారని కేసీఆర్ చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తేనే మునుగోడులో అభివృద్ది సాధ్యమవుతుందన్నారు కేసీఆర్. మునుగోడు ఓటర్లు ఇచ్చే తీర్పుతోనే బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో పోరాటం చేస్తుందన్నారు.
గాడిదకు గడ్డి వేసి పాలు పిండితే ఎలా..
గాడిదకు గడ్డి వేసి ఆవును పిండేతే పాలు రావు..అందుకే ఓటర్లు ఎవరి మాటలకు ప్రలోభాలకు లోనవకుండా ఓటేయాలి. విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లుతో ఎంత నష్టం వాటిల్లుతుందో అర్ధం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. కార్పొరేట్ గద్దలకు ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకు జరుగుతున్న కుట్రను గ్రహించాలని ఓటర్లను కోరారు. బీజేపీ ఉచ్చులో పడితే కష్టపడేది..నష్టపడేది ప్రజలేనని తెలంగాణ సీఎం తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Munugode Bypoll, Telangana Politics