హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ts Politics: సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ..పైలట్ ప్రాజెక్ట్ గా మునుగోడు ఎంపిక..స్కిం మార్పు కలిసొచ్చేనా?

Ts Politics: సీఎం కేసీఆర్ కొత్త స్ట్రాటజీ..పైలట్ ప్రాజెక్ట్ గా మునుగోడు ఎంపిక..స్కిం మార్పు కలిసొచ్చేనా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని గొల్ల. కురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేశారు. 2017 జూన్ 20న సిద్ధిపేట జిల్లా కొండపాకలో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ ప్రభుత్వం (telangana government) ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చింది. రాష్ట్రంలోని గొల్ల. కురుమలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేశారు. 2017 జూన్ 20న సిద్ధిపేట జిల్లా కొండపాకలో ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ (Kcr) ప్రారంభించారు. ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలుగా యూనిట్ గా కేటాయించి పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్ కు 1.25 లక్షల ఖర్చులో 75 శాతం ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. మిగిలిన 25 శాతం లబ్ధిదారుడు భరించాలి. అయితే ఇప్పటివరకు ఒకే విడతలో గొర్రెల పంపిణీ (sheep distribution) జరిగింది. ఈ పంపిణీలో అవకతవకలు ఉండడంతో రెండో విడత పంపిణీ  మరింత ఆలస్యం అయింది.

  ఇక మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ రిలీజ్ తో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే మునుగుడు  ఉపఎన్నికలో (munugodu by poll)  కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (komatireddi rajagopal) మునుగోడు ప్రచారంలో పాల్గొంటారా అనేది సస్పెన్స్ గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ బ్రాండ్. కానీ ఇప్పుడు ఇద్దరు వేరు వేరు పార్టీలలో ఉండడంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కాగా మునుగోడు గెలుపుపై కాంగ్రెస్ గంపెడు ఆశలు పెట్టుకుంది.

  మరోవైపు తమకు బలమైన అభ్యర్థి ఉన్నాడని బీజేపీ ధీమాగా ఉంది. కాగా బీజేపీ మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి తెలంగాణలోనూ అధికారంలోకి రావాలనేది బీజేపీ వ్యూహం. కాగా ఇప్పటికే బీజేపీ తరపున ఉపఎన్నిక బరిలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే బండి సంజయ్ (bandi sanjay) ఐదో విడత పాదయాత్రతో సహా పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.  ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటివరకు మునుగోడు అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ గులాబీ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు సమాచారం. కానీ దీనిపై నేడు అధికార ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

  ఇదిలా ఉంటే మునుగోడులో గొల్ల కురుమల ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ తన స్ట్రాటజీ మొదలుపెట్టారు. గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా గొర్రెలను పంపిణీ కాకుండా డబ్బులు నేరుగా అర్హుల ఖాతాలో వేయనున్నారు. దీని కోసం మునుగోడును పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. గొర్రెల పంపిణీపై ఆరోపణలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధివిధానాలు పూర్తి చేసి త్వరలోనే ఈ ప్రక్రియ స్టార్ట్ చేయనున్నారు. ఇప్పుడు ఈ స్కిం హాట్ టాపిక్ గా మారింది. ఇక  ఈ స్కిం పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేవలం ఓటు బ్యాంకు కోసమే తీసుకొస్తున్నారన్నారు. దీనిని ఎన్నికల ప్రలోభంగా గుర్తించాలని బీజేపీ నాయకులు ఈసీకి లేఖ రాశారు. ఇక ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పార్టీ  కొట్టిపారేసింది.యాదవుల సంక్షేమం కోసం ఈ పథకం తెచ్చామని, కొన్నిచోట్ల గొర్రెల రీ సైక్లింగ్ జరిగిందని తెలిసింది. అందుకే  గొర్రెలకు బదులుగా నగదు బదిలీగా మార్చామన్నారు. తప్పును సరి చేయడం కూడా తప్పేనా అంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు.

  Published by:Rajasekhar Konda
  First published:

  ఉత్తమ కథలు