హోమ్ /వార్తలు /తెలంగాణ /

Pawana Kalyan Telangana tour: రేపు తెలంగాణలో పర్యటించనున్న జనసే అధినేత పవన్​ కల్యాణ్​.. పూర్తి వివరాలివే..

Pawana Kalyan Telangana tour: రేపు తెలంగాణలో పర్యటించనున్న జనసే అధినేత పవన్​ కల్యాణ్​.. పూర్తి వివరాలివే..

పవన్ కల్యాణ్ (ఫైర్)

పవన్ కల్యాణ్ (ఫైర్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

జనసేన అధినేత పవన్​ కల్యాణ్ (Jana sena President Pawan kalyan) పార్టీ పెట్టినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేస్తారని అనుకున్నారు రాజకీయ నాయకులు. పవన్​ అభిమానులు సైతం ఇదే అనుకున్నారు. కానీ అనూహ్యంగా పవన్​ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితమయ్యారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారనుకున్నా చివరి నిమిషంలో వెనుదిరిగారు. ఇక తెలంగానలో కష్టమే అని అనుకుంటున్న తరుణంలో సరైన సమయంలో తెలంగాణలో అడుగుపెడుతాననే ఇటీవలె సూచన ప్రాయంగా జనసేనాని ప్రకటించినట్లు తెలిసింది. కాగా, తెలంగాణలో సైతం పవన్​కు చాలామంది అభిమానులే ఉన్నారు. ఆయన రాక కోసం (Pawan kalyan Telangana tour) ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే పవన్​ అభిమానులకు తీపి కబురు వచ్చేసింది.  పవన్ కళ్యాణ్  (Jana sena chief Pawan Kalyan) రేపు ( మే 20న) తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు.

కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడానికి..

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి పర్యటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో (Pawana Kalyan Telangana tour) పర్యటించనున్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసిన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను (Families of activists) పరామర్శించడానికి, పార్టీ కార్యకర్తలతో మాట్లాడటానికి పర్యటన చేయనున్నట్టు జనసేన (Jana sena) పార్టీ ప్రకటించింది.

పవన్ కళ్యాణ్ ఈనెల 20వ తేదీన తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్టు ఆ పార్టీ నల్గొండ జిల్లా ఇన్చార్జి మేకల సతీష్ రెడ్డి (Satish Reddy)మీడియాకు ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళుతూ మధ్యలో పవన్ కళ్యాణ్ చౌటుప్పల్ లో ఆగుతారని, ఆపై కోదాడకు వెళ్తారని జనసేన పార్టీ వెల్లడించింది.

ఉమ్మడి నల్గొండ (Nalgonda) జిల్లాలో పర్యటన కోసం పవన్ కల్యాణ్ రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ (Hyderabad) నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మెట్టుగూడ అంబేడ్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ (LB Nagar) మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం వెళ్లనున్నారు. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పవన్ పరామర్శించనున్నారు. అనంతరం కోదాడ వెళ్లనున్న పవన్.. కడియం శ్రీనివాసరావు (Kadium Srinivasa Rao) కుటుంబాన్ని పరామర్శిస్తారు. పవన్ పర్యటనకు సంబంధించిన ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన నాయకులు (jana sena leaders) ఏర్పాట్లు చేస్తున్నారు.

First published:

Tags: Janasena, Nalgonda, Pawan kalyan

ఉత్తమ కథలు