హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: నల్గొండలో భర్తల ఆత్మహత్య.. భార్య తీరుతో మనస్తాపం చెంది ఒకరు, కాపురానికి రావడం లేదని మరొకరు..

Nalgonda: నల్గొండలో భర్తల ఆత్మహత్య.. భార్య తీరుతో మనస్తాపం చెంది ఒకరు, కాపురానికి రావడం లేదని మరొకరు..

నల్గొండ క్రైమ్​

నల్గొండ క్రైమ్​

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉద్యోగి మరణించిన ఘటన హుజుర్ నగర్ పట్టణం కోదాడ రోడ్డులో చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందంటూ మనస్తాపానికిగురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిండి మండలంలో చోటు చేసుకుంది

  (Nagaraju, News18, Nalgonda)

  నల్గొండలో (Nalgonda) ఒకేరోజు ఇద్దరు భర్తలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇద్దరూ భార్యా బాధితులే. వివరాలు..  కట్టుకున్న భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందంటూ మనస్తాపానికిగురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డిండి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..డిండి మండలం పెద్దతండాకు చెందిన కాట్రావత్ భాస్కర్...మంచాలకు ప్లాస్టిక్ నవారు అల్లుతూ జీవనం సాగిస్తున్నాడు. నాగర్‌కర్నూల్ జిల్లా అక్కారం గ్రామానికి చెందిన జానితో భాస్కర్ కు మొదట వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అనారోగ్యంతో జాని మృతి చెందగా.. 2015లో డిండి మండలం శ్యామల బావి తండాకు చెందిన అనితను భాస్కర్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

  ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం..

  అయితే ఇటీవల అనిత పెద్దతండాకు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భాస్కర్ కు తెలిసింది. దీంతో ఇరువురు తరుచు గోడవ పడేవారు. ఇరుకుటుంబాల పెద్దలు పలుమార్లు పంచాయతీ నిర్వహించి నచ్చజెప్పినా భార్య ప్రవర్తనలో మార్పురాలేదు. శుక్రవారం ఇద్దరి మధ్య మరోసారి గోడవ జరగ్గా మనస్తాపానికి గురైన భాస్కర్ ఇంటి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు...అనితతో పాటు గణేష్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  భార్య కాపురానికి రావడం లేదని..

  భార్య కాపురానికి రావడం లేదని భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కనగల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు బోయినపల్లి గ్రామానికి చెందిన రుద్రాక్షి మధు (25), దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో భార్య పుట్టింటికి వెళ్లిపోగా మధు ఒంటరివాడయ్యాడు. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందిన మధు, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఉద్యోగి మరణించిన ఘటన నల్గొండ (Nalgonda) జిల్లా హుజుర్ నగర్ పట్టణం కోదాడ రోడ్డులో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దద్దనాల చెరువు కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉద్యోగి షేక్ జానిమియా(72).. పట్టణంలోని మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకుని బుల్లెట్ వాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో హుజుర్ నగర్ నుంచి కోదాడ వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి జానిమియా బైక్ ను ఢీకొట్టింది. ఈఘటనలో జానిమియాకు బలమైన గాయాలు కాగా, స్థానికులు స్పందించి దగ్గర్లోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఖమ్మంలోని ఓప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే జానిమియా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Local News, Nalgonda, Wife and husband

  ఉత్తమ కథలు