Home /News /telangana /

NALGONDA IN THREE SEPERATE INCIDENTS THREE PEOPLE DEAD IN NALGONDA DISTRICT ABH BRV NLG

Nalgonda: దుక్కి దున్నేందుకు వెళ్లి...ట్రాక్టర్ డ్రైవర్ మృతి!..

వివిధ ఘటనలో ముగ్గురు మృతి

వివిధ ఘటనలో ముగ్గురు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. పులగం బండ తండాకు చెందిన రమావత్ రాందాస్...బాడుగ నిమిత్తం తన ట్రాక్టర్‌తో జగన్నాతండాలో దుక్కి దున్నేందుకు వెళ్ళాడు

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda | Telangana
  ( Nagaraju,News, Nalgonda)

  ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. పులగం బండ తండాకు చెందిన రమావత్ రాందాస్, బాడుగ నిమిత్తం తన ట్రాక్టర్‌తో జగన్నాతండాలో దుక్కి దున్నేందుకు వెళ్ళాడు. పని పూర్తయ్యాక ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జగన్నాతండా వద్ద ఒక్కసారిగా ట్రాక్టర్ అద్భుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలంలో బోల్తా పడింది. ట్రాక్టర్ బోల్తా పడడంతో రాందాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అనుష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిన ఘటన వలిగొండ మండలంలో చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కధనం మేరకు.. ప్రొద్దుటూర్ గ్రామానికి చెందిన పెద్ద బోయిన శేఖర్ కొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులతో సతమతమౌతున్నాడు. ఈక్రమంలో శనివారం నాడు వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పొలంలో అపస్మారకస్థితిలో ఉన్న శేఖర్‌ను స్థానికులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శేఖర్ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు.

  రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మిర్యాలగూడ మండల పరిధిలోనీ శ్రీనివాసనగర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి సాగర్ మండలం మేత్య తండాకు చెందిన సక్రు దంపతులు కూలి పనులకు వెళ్లి బైక్ పై తిరిగి వస్తుండగా... శ్రీనివాసనగర్ గ్రామ శివారులో మిర్యాలగూడ పట్టణ వైపు వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో సక్రు అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి వారిని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సక్రు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Local News, Nalgonda, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు