హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి

Nalgonda: ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి

బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

బైక్ అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి.

  (Nagaraju, News 18, Nalgonda)

  ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కట్టంగూరు మండలంలో చోటుచేసుకుంది. మృతి చెందిన యువకుడు కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన మాతంగి సందీప్‌గా పోలీసులు గుర్తించారు. బుధవారం అర్ధరాత్రి కేతేపల్లి నుంచి కట్టంగూరు వైపు ద్విచక్రవాహనంపై వస్తున్న సందీప్, అయిటిపాముల చేరుకుంటున్న క్రమంలో బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సందీప్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చండూరు మండలంలో చోటుచేసుకుంది. కమ్మగూడెం గ్రామానికి చెందిన అక్కినపల్లి శంకర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేసేవాడు. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలు వెంటాడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం అర్థ రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో వెళ్లిన శంకర్ ను కుటుంబ సభ్యులు గమనించి నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం శంకర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

  ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి అడివెంల శివారులో చోటుచేసుకుంది. అడివెంలకు చెందిన ఈగ ఉప్పలయ్య గురువారం అర్ధరాత్రి గ్రామం నుంచి ద్విచక్రవాహనంపై అడివెంల స్టేజి వద్దకు బయలుదేరాడు. ఈక్రమంలో ఎదురుగా వచ్చిన వ్యవసాయ ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఉప్పలయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. ఉప్పలయ్య భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్వపల్లి ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Local News, Nalgonda, Telangana

  ఉత్తమ కథలు