Home /News /telangana /

NALGONDA ILLEGAL GANJA SMUGGLING IN NALGONDA DISTRICT INTER STATE GANG MEMBERS ARRESTED ABH BRV NLG

Nalgonda: నాలుగు రాళ్లు వెనకేద్దామనుకుని.. ఇప్పుడు ముఖాలకు ముసుగులేసుకున్న నలుగురు కేటుగాళ్ల కథ

అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 400 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మంగళవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం

 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda | Telangana
  (Nagaraju, News 18, Nalgonda)

  అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 400 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మంగళవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి వాహనాల్లో మహారాష్ట్రకు రవాణా చేస్తున్నారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం నల్గొండ జిల్లా తిప్పర్తి టాస్క్‌ఫోర్స్ బృందం.. రైల్వేస్టేషన్ రోడ్డు సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పద రీతిలో మూడు కార్లలో ఉన్న వ్యక్తులను గుర్తించారు. దీంతో పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. ఈఘటనలో నలుగురు నిందితులు పట్టుబడగా.. మరో ఏడుగురు నిందితులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు.. కోదాడ ప్రాంతానికి చెందిన షేక్ నాగుల్ మీరా, మీసాల నిలేష్, సయ్యద్ షేక్, మాడుగుల రాహుల్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఏడుగురు వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో అంగోతు నాగరాజు, సుధాకర్.. గతంలోనూ నిషేధిత గంజాయి అక్రణ రవాణాలో పట్టుబడగా, వారిని ఎన్‌డి‌పి‌ఎస్ చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపినా తిరిగి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

  భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య:

  భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా కేంద్రంలోని అక్కలాయిగూడెంలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సిఐ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. అక్కలాయిగూడెంకి చెందిన మహేష్‌కి అదే ప్రాంతానికి చెందిన అనితతో 2013లో వివాహం జరిగింది.పెళ్ళై ఏళ్లు గడుస్తున్నాపిల్లలు పుట్టక పోవడంతో.. గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో మంగళవారం నాడు మహేష్, అనిత మరోసారి గొడవపడ్డారు. అనంతరం అనిత వాళ్ళ అక్క ఇంటికి వెళ్లిపోగా, మనస్థాపం చెందిన మహేష్.. ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు మృతిపై అనుమానం ఉందని మహేష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  First published:

  Tags: Crime news, Local News, Nalgonda, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు