హోమ్ /వార్తలు /తెలంగాణ /

Selfie Death: సెల్ఫీ కోసం లైఫ్ రిస్క్ .. క్షణాల్లో ఊహించని సంఘటన  

Selfie Death: సెల్ఫీ కోసం లైఫ్ రిస్క్ .. క్షణాల్లో ఊహించని సంఘటన  

Selfie Death

Selfie Death

Selfie Death: సోషల్ మీడియాలో ఫాలోయింగ్ , క్రేజ్ కోసం యువత లైఫ్‌ను రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. రీల్స్ కోసం, సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్స్ కోసం ప్రమాదపుటంచుల్లో సెల్ఫీల కోసం ప్రయత్నించి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda, India

  (P.Mahendar,News18,Nizamabad)

  సోషల్ మీడియా(Social media)లో ఫాలోయింగ్ , క్రేజ్ కోసం యువత లైఫ్‌ను రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. రీల్స్ కోసం, సోషల్ మీడియాలో లైక్‌లు, కామెంట్స్ కోసం ప్రమాదపుటంచుల్లో సెల్ఫీ(Selfie )ల కోసం ప్రయత్నించి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. వరంగల్‌(Warangal) జిల్లాలో రీల్ కోసం ట్రైన్‌ పక్కన నడిచి తీవ్రంగా గాయపడిన సంఘటన మర్చిపోక ముందే మరో యువకుడు సెల్ఫీ కోసం డిండి ప్రాజెక్టు(Dindi Reservoir)దగ్గర ఫోటోకి ఫోజులిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన నల్గొండ( Nalgonda)జిల్లాలో చోటుచేసుకుంది.

  Crime news: అందమే ఆమె పాలిట శాపమైంది .. భర్తను అనుమాన పిశాచిగా మార్చింది.. అసలేం జరిగిందంటే

  సెల్ఫీ మోజులో ..

  నల్గొండ జిల్లా డిండి రిజర్వాయర్ దగ్గర రెండ్రోజుల క్రితం సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి 22 ఏళ్ల యువకుడు నీటిలో మునిగి చనిపోయాడు. బాధితుడు హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన యు.మనోజ్‌గా గుర్తించారు. మనోజ్ మరో ఆరుగురు స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా డిండి వద్ద ఆగారు. అక్క‌డ సెల్పీల కోసం ప్ర‌య‌త్నిస్తుండ‌గా మనోజ్ కాలు జారి రిజర్వాయర్‌లో పడిపోయాడు. డిండి రిజర్వాయర్  స్పిల్‌వే గేట్‌కు చాలా ద‌గ్గ‌ర‌గా వెళ్ల‌డం వ‌ల‌న రిజ‌ర్వాయ‌ర్‌లో పడి ప్రాణాలు కొల్పొయాడు. సాయంత్రం 5గంటల సమయంలో ఈఘటన జరిగింది. అప్ప‌టికే చిక‌టి ప‌డ‌డంతో మనోజ్‌ను రిజర్వార్‌లో గుర్తించ‌డం క‌ష్ట‌మైంది.

  జలసమాధి..

  మరుసటి రోజు ఉదయం జాలర్లు, గజ ఈతగాళ్లతో గాలించగా మనోజ్ మృత‌దేహాన్ని రిజ‌ర్వాయ‌ర్‌లో గుర్తించారు. దాన్ని బయటకు తీశారు. ఇదే రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా సంద‌ర్శ‌కులు నిర్ల‌క్ష్యం వ‌ల‌న చాలా వ‌ర‌కు ప్ర‌మాదాలు సంభ‌విస్తోన్నాయంటున్నారు. ఏడాది క్రితం ఇదే తరహాలో నల్గొండకు చెందిన ఇద్దరు యువకులు డిండి జలాశయం వద్ద సెల్ఫీ తీసుకుంటూ మృతి చెందారు. అయితే ఆ ఘ‌ట‌న మ‌ర్చిపోక ముందే మ‌ళ్లీ అదే జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందడంపై అధికారులు విచారం వ్యక్తం చేశారు.

  Crime news : జల్సాల కోసం అప్పులు చేశాడు .. వాటిని తీర్చడం కోసమే ఆ విధంగా మారాడు

  క్రేజ్ కోసం లైఫ్ రిస్క్ ..

  కుర్రాళ్లు సెల్ఫీలు, సోషల్ మీడియాలో క్రేజ్ కోసం చేసే విపరీత చర్యలు, వెరైటీ స్టంట్‌లు వాళ్ల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ముఖ్యంగా సెల్పీలు, రీల్స్ కోసం లైఫ్‌ను రిస్క్‌లో పెట్టుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం వరంగల్‌లోని వడ్డేపల్లి రైల్వే ట్రాక్‌ దగ్గర ఇంటర్‌ స్టూడెంట్ అజయ్ రైల్వే ట్రాక్ నుండి కేవలం అంగుళాల దూరంలో నడుస్తూ ట్రైన్ వస్తుండగా వీడియో చేయాలనుకున్నాడు. అది కాస్తా రివర్స్ కావడంతో రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. రైలు కాజీపేట నుంచి మంచిర్యాల వైపు వెళ్తుండగా ఈఘటన జరిగింది. రక్తపు మడుగులో పడిన అజయ్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చావు,బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Nalgonda, Selfie Death, Telangana News

  ఉత్తమ కథలు