Home /News /telangana /

NALGONDA HUSBAND TRIED TO COMMIT SUICIDE AFTER KILLING HIS WIFE IN NALGONDA DISTRICT SNR

Marital murder : కొంప ముంచిన భర్త అనుమానం.. భార్యను ఏం చేశాడో తెలుసా ..?

(Marital murder)

(Marital murder)

Marital murder: ఆమె ప్రవర్తన అతనిలో అనుమానాన్ని రగిల్చింది. భర్త గడప దాటడం ఆలస్యం ఆమె కొందరితో చనువుగా ఉండటం తట్టుకోలేకపోయాడు. తనకు తెలియకుండా ఏదో జరుగుతోందని అపోహ పడ్డాడు. అదే కోపంతో భార్యపై ఆ విధంగా కసి తీర్చుకున్నాడు. చివరకు చావు,బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

ఇంకా చదవండి ...
అనుమానం పెనుభూతంగా మారింది. ఆమె ప్రవర్తన అతనిలో కొత్త అనుమానాన్ని రగిల్చించింది. తాను ఇంట్లో లేనప్పుడు ఏం చేస్తుందో ...? ఎవరికి ఫోన్‌ చేస్తుందో ..? ఎందుకలా అందరితో క్లోజ్‌గా మాట్లాడుతోందో అర్ధం కాక ఉన్మాదిగా మారాడు. కట్టుకున్న భార్య అని కూడా చూడకుండా ఆమెతో గొడవపడ్డాడు. అదే క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. తర్వాత ఏం చేశాడో తెలిసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అత్యంత దారుణంగా సంఘటన నల్గొండ(Nalgonda)జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

Telangana : 45మంది హాస్టల్ అమ్మాయిలకు అస్వస్థత .. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో ఇది రెండో ఘటనభార్యపై అనుమానంతో..
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ అనే 29సంవత్సరాల వ్యక్తి అదే మండలం పాలెం గ్రామానికి చెందిన స్వాతి అనే మహిళను ఏడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఒక పాప, ఓ బాబు ఉన్నారు. శ్రీకాంత్ ప్లంబర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత ఆరేళ్లుగా కాపురం సాఫీగానే సాగుతోంది. నకిరేకల్‌లోని పన్నాలగూడెంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. ఏడాది నుంచి శ్రీకాంత్ భార్య స్వాతికి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అదే విషయంలో తరచూ గొడవపడుతూ వస్తున్నారు.క్షణికావేశంలో ..
రెండ్రోజుల క్రితం స్వాతి, శ్రీకాంత్ ఉదయం పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తర్వాత మరోసారి గొడపడ్డారు. అదే సమయంలో సహనం కోల్పోయిన శ్రీకాంత్‌ భార్యను దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత 9.30 గంటల సమయంలో నకిరేకల్‌లోనే ఉంటున్న స్వాతి అక్క పల్ల స్వప్నకు శ్రీకాంత్‌ ఫోన్‌ చేసి మీ చెల్లెను చంపేశానని చెప్పి ఇంట్లోంచి పారిపోయాడు. మృతురాలి సోదరి హుటాహుటిన స్పాట్‌కి చేరుకొని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Rajanna Sircilla: అర్ధనగ్నంగా ఇళ్లలోకి చొరబడుతున్న వ్యక్తులు .. లోపలికి వెళ్లి ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్భార్యను చంపి తాను..
భార్య స్వాతిని హత్య చేసి ఇంటి నుంచి పారిపోయిన శ్రీకాంత్‌ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అనంతరం తనంతట తానే ఆసుపత్రికి వెళ్లడంతో అతని పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. నల్లగొండ ఆసుపత్రిలో శ్రీకాంత్‌కి వైద్యులు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. హత్య స్తలాన్ని పరిశీలించిన నకిరేకల్‌ సీఐ వెంకటయ్య స్వాతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కోలుకున్న తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లి చనిపోయి..తండ్రి ఆసుపత్రిలో చేరడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. కుటుంబ సభ్యులు పిల్లలను చేరదీశారు. కేవలం అనుమానంతోనే స్వాతిని శ్రీకాంత్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Husband killed by wife, Nalgonda, Telangana crime news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు