హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime: మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వివాహిత..భరించలేకే భర్త ఆ పని చేశాడంట

Crime: మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వివాహిత..భరించలేకే భర్త ఆ పని చేశాడంట

(భార్య క్యారెక్టర్‌ నచ్చక)

(భార్య క్యారెక్టర్‌ నచ్చక)

Nalgonda Crime:ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతకు ముందే మరొకరితో ప్రేమాయణం కొనసాగించింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా మాజీ ప్రియుడితో వెళ్లిపోయింది. అన్నీ మర్చిపోయి బతుకుతున్న భర్తకు మళ్లీ ఫోన్ చేసి కలుసుందాం అంది. అంతే ఆ ఫోన్‌కాల్‌తోనే భర్తకు డౌట్‌ రావడంతో ఆమెపై తన కసి తీర్చుకున్నాడు.

ఇంకా చదవండి ...

(K.Veeranna,News18,Medak)

నాలుగు రోజుల క్రితం నల్లగొండ(Nalgonda)లోని పున్నమి లాడ్జీ(Punnami Lodge)లో హత్యకు గురైన మహిళ కేసులో మిస్టరీ(Mystery)ని చేధించారు పోలీసులు. హత్య అనంతరం జరిగిన పరిణామాలు, మహిళను చంపడానికి దారి తీసిన కారణాలను రాబట్టిన పోలీసులు(Police) హంతకుడు ఆమె భర్తేనని తేల్చారు. పచ్చని కాపురాలు కూలిపోవడానికి కారణమవుతున్న వివాహేతర సంబంధామే(Extramarital affair)ఈ హత్యకు కారణమని నిర్ధారించారు. మృతురాలు రాతుల సరిత(Saritha)అలియాస్ శిరీష(Sirisha)మెదక్ (Medak)జిల్లా కొండాపురం(Kondapuram)గ్రామానికి చెందినట్లుగా గుర్తించారు. చౌకత్పల్లి(Chowkatpally)కి చెందిన మురావత్ శంకర్‌(Murawat Shankar)ని ప్రేమించి రెండు నెలల క్రితమే వివాహం చేసుకుంది. శిరీష భర్తతో కాపురం సజావుగా సాగుతుండగా ఏప్రిల్‌(April‌)1వ తేదినాడు ఉగాది పండుగకు భార్యను పుట్టింటికి పంపాడు శంకర్.

ఆమెకు ఇద్దరు ప్రియుళ్లు..

సరితకు శంకర్‌తో వివాహం జరిగే ముందు కొండాపురం గ్రామానికి చెందిన సురేష్‌ యువకుడ్ని ప్రేమించింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్యను పుట్టింటికి పంపిన తర్వాత మాజీ ప్రియుడు సురేష్‌తో కలిసి ఇల్లు వదిలి పారిపోయింది. సరిత తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో సురేష్‌తో పాటు సరితను పట్టుకొచ్చారు. పోలీసులు, పెద్దల సమక్షంలోనే తానకు సురేష్ అంటే ఇష్టమని..అతనితోనే ఉంటానని చెప్పడంతో పోలీసులు సరితను సురేష్‌తో పంపించారు.

భర్తతో ఉంటే ప్రియుడు కావాలి..

భార్య మాజీ ప్రియుడితో వెళ్లిపోవడంతో..శంకర్‌ మునుగోడు మండలం కొరటికల్‌లో రోడ్డు పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఈక్రమంలోనే కొన్ని రోజుల తర్వాత సరిత భర్త శంకర్‌కి ప్రియుడు సురేష్ ఫోన్‌ నుంచి కాల్ చేసి తాను నీతో వస్తానని వెంట తీసుకెళ్లమని కోరింది. దాంతో శంకర్ ఈ నెల 12న హైదరాబాద్ వెళ్లి మధ్యాహ్నం సరితను తీసుకుని నల్లగొండకు వచ్చాడు. అప్పటికి చీకటి పడటంతో బస్సులు ఉండవని రేపు ఉదయం హైదరాబాద్‌కి వెళ్దామని చెప్పి భార్య సరితను తీసుకొని నల్లగొండ బస్టాండ్ ఎదురుగా ఉన్న పున్నమి లాడ్జ్‌లో రూమ్‌ తీసుకున్నాడు.

ప్రియుడితో ఉంటే భర్త కావాలి..

మరుసటి రోజు ఉదయం 13వ తేదీ మధ్యాహ్నం శంకర్‌, సరిత మధ్య వాగ్వాదం జరిగింది. తన భార్య మళ్లీ ఎక్కడ మాజీ ప్రియుడితో వెళ్తుందోననే అనుమానంతో శంకర్ సరిత మెడను చున్నీతో బిగించి హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలి లాడ్జీ నుంచి పారిపోయాడు. లాడ్జి సిబ్బంది పోలీసులకిచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలించారు. సోమవారం మధ్యాహ్నం మునుగోడు వెళ్లేందుకు బస్టాండ్ దగ్గరున్న శంకర్‌ని అదులోకి తీసుకొని ప్రశ్నించడంతో నేరం తానే చేసినట్లు అంగీకరించాడు. భార్య మళ్లీ ఎక్కడ తన మాజీ ప్రియుడితో వెళ్లిపోతుందోనన్న అనుమానంతోనే హతమార్చినట్లు శంకర్‌ ఒప్పుకున్నట్లు సీఐ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

First published:

Tags: Extra marital affair, Nalgonda police

ఉత్తమ కథలు