హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda Plane Crash: నల్గొండలో కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి..!

Nalgonda Plane Crash: నల్గొండలో కుప్పకూలిన విమానం.. ఇద్దరు మృతి..!

Nalgonda Plane Crash: విమాన శకలాల కింద మృతదేహాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. పెద్ద శబ్ధంతో విమానం కూలిపోయిందని.. మంటలు ఎగసిపడడం కూడా తాము చూశామని పలువురు తెలిపారు

  నల్గొండ జిల్లాలో విమాన ప్రమాదం జరిగింది. ఓ ట్రైనీ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదంలో పైలట్‌తో పాటు ట్రైనీ పైలట్ మృతి చెందినట్లు తెలుస్తోంది. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం కూలిన శబ్ధం వినగానే గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఐతే అప్పటికే విమానం ముక్కలు ముక్కలయింది. అందులో ఉన్న పైలట్లు ఇద్దరూ మరణించారని స్థానికులు తెలిపారు. విమాన శకలాల కింద మృతదేహాలు ఉన్నాయని చెబుతున్నారు. పెద్ద శబ్ధంతో విమానం కూలిపోయిందని.. మంటలు ఎగసిపడడం.. దట్టమైన పొగలు వ్యాపించడం తాము చూశామని పలువురు గ్రామస్తులు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నారని.. మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయని చెప్పారు. విమానం జనావాసాల మధ్య కూలితే.. అక్కడి ప్రజలు ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేవని, గ్రామ శివారులో ప్రమాదం జరగడంతో ముప్పు తప్పిందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

  Hyderabad : హ్యాట్సాఫ్ to సీఎం కేసిఆర్.. విజయవాడలో ఫ్లేక్సి ఏర్పాటు చేసిన పవన్ ఫ్యాన్స్..

  విమానం నాగార్జున సాగర్ నుంచి వచ్చిందని.. బహుశా హైదరాబాద్ వైపు వెళ్తుండవచ్చని స్థానికులు తెలిపారు. సాధారణంగా ట్రైనీ విమానాల్లో సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు.. అందులో ఉన్న పైలట్లు పారాచ్యూడ్ సాయంతో దూకేందుకు ప్రయత్నిస్తారు.కానీ ఇక్కడ అలా జరగలేదు. తప్పించుకునే ప్రయత్నం చేసినా.. సాధ్యం కాలేదని గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇలాంటి శిక్షణ విమానాలు నగర శివారు ప్రాంతాలకు వెళ్తుంటాయి. వీటిలో ట్రైనీ పైలట్లకు శిక్షణ ఇస్తారు. ప్రమాదానికి గురైన విమానం ఒక రౌండ్ బాగానే వెళ్లిందని.. రెండో రౌండ్‌ ముగించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఐతే విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత కింద పడిందని కొందరు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను కూడా తెలియాల్సి ఉంది. మరికాసేపట్లో పూర్తి వివరాలను వెల్లడించే అవకాశముంది.

  First published:

  Tags: Nalgonda, Plane Crash, Telangana

  ఉత్తమ కథలు