NALGONDA GROOM ACCIDENTALLY DRIVES CAR OVER BOY DANCING AT WEDDING BARAT IN NALGONDA PRV
Wedding Barat: పెళ్లి బరాత్‌లో ఘోరం.. డ్యాన్సు చేస్తున్న బాలుడిపైకి కారు పోనిచ్చిన పెళ్లి కొడుకు
ప్రతీకాత్మక చిత్రం
అక్కడ పెళ్లి బరాత్ (Wedding barat) జరుగుతోంది. గ్రామం కాబట్టి బరాత్ అయితే ప్రతీ ఒక్కరూ వచ్చి డ్యాన్స్‌లు వేస్తుంటారు. గ్రామ యువకులు, బంధువులు, స్నేహితులు అంతా ఆ డీజే పాటలలో స్టెప్పులేశారు. కాసెపట్లో పెళ్లి కొడుకు ఇంటికి ఈ బరాత్ చేరుకుంటుందనగా అనూహ్య ఘటన జరిగింది.
అక్కడ పెళ్లి బరాత్ (Wedding barat) జరుగుతోంది. గ్రామం కాబట్టి బరాత్ అయితే ప్రతీ ఒక్కరూ వచ్చి డ్యాన్స్‌లు వేస్తుంటారు. గ్రామ యువకులు, బంధువులు, స్నేహితులు అంతా ఆ డీజే పాటలలో (DJ Songs)స్టెప్పులేశారు. కొంత సమయం వధూవరులిద్దరూ కూడా ఆ పాటలకు డ్యాన్సులు వేశారు. అంతా బాగానే ఉంది ఇంకాసెపట్లో పెళ్లి కొడుకు ఇంటికి ఈ బరాత్ చేరుకుంటుందనగా అనూహ్య ఘటన జరిగింది.
డ్యాన్స్ చేస్తున్న వారిపై నుంచి కారు దూసుకెళ్లింది (Car drove). ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. పలువురికి గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటనలో కారు నడిపింది పెళ్లికొడుకే (Groom)కావడం ఇక్కడ విచారకరం. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. నల్గొండ (Nalgonda) జిల్లా చండూరులోని గట్టుప్పలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మల్లేష్ పెళ్లి బుధవారం జరిగింది. యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvana Giri) జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు. పెళ్లి, ఇతర పూజా కార్యక్రమాలు పూర్తయిన తరువాత వధూవరులిద్దరూ ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ముందే అనుకున్న ప్రకారం బరాత్ ఏర్పాటు చేశారు. ఆ బరాత్ పెళ్లి కొడుకు ఇంటికి ఊరేగింపుగా వెళ్తోంది.
DJ Songsతో బంధు మిత్రులు,వారి పిల్లలు, ఊరిలో వాళ్లు అందరూ సంతోషంగా స్టెప్పులేశారు. అంతేకాదు ఆ పెళ్లి కొడుకు ఇంటికి బరాత్ ఇంకా కొద్ది దూరంలో ఉంది. ఈ క్రమంలో వధూవరులు ఇద్దరూ వారి కారులో నుంచి దిగారు. ఆ బరాత్ లో చుట్టాలు, స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఆ ప్రాంతమంతా కోలహలంగా మారిపోయింది.
కారు డ్రైవింగ్ సీటులో పెళ్లి కొడుకు..
అయితే DJ కొంచెం ముందుకు సాగడంతో వధూవరులు వచ్చిన Car వెనకాలే ఉండిపోయింది. ఆ కారు డ్రైవర్ ఆ చుట్టుపక్కలే ఉన్నాడు. కొంత దూరమే కదా అని ఆ పెళ్లి కొడుకు వెళ్లి డ్రైవర్ సీట్లో (Driver seat) కూర్చున్నాడు. కానీ నిజానికి అతడికి డ్రైవింగ్ తెలియదు (Don't know drive). కారు స్టార్ట్ (He started the car) చేసి ముందుకు పోనిచ్చాడు. అయితే ఆ కారు వరుడుకి కంట్రోల్ కాలేదు. ఒక్క సారిగా అది డీజే (DJ) ముందు డ్యాన్ చేస్తున్న వారిపైకి దూసుకొని వెళ్లింది. ఈ పరిణామానికి అక్కడ వారందరూ ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఆ కారు వెళ్లి డీజే ఉన్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
బాలుడిపైకి దూసుకెళ్లిన కారు..
ఈ క్రమంలో డీజే ముందు డ్యాన్స్ చేస్తున్న దుబ్బాక సాయిచరణ్ ( Sai charan) అనే 13 ఏళ్ల బాలుడు చనిపోయాడు. అక్కడే డ్యాన్స్ చేస్తున్న యువకులకు, బరాత్ తిలకిస్తున్న పలువురికి గాయాలు అయ్యాయి. అంతేకాకుండా పెళ్లి కొడుకు కూడా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఘటనకు కారకుడైన పెళ్లి కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పెళ్లై 24 గంటలు కూడా గడవకముందే ఇలా జరిగిందేటా? అని ఊరంతా చర్చించుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.