హోమ్ /వార్తలు /తెలంగాణ /

SURYAPETA: పాఠాలు చెబుతూనే పతకాల వేట .. మల్టీ టాలెంటెడ్ టీచర్ విజయ సక్సెస్ స్టోరీ

SURYAPETA: పాఠాలు చెబుతూనే పతకాల వేట .. మల్టీ టాలెంటెడ్ టీచర్ విజయ సక్సెస్ స్టోరీ

(టాలెంటెడ్ టీచర్)

(టాలెంటెడ్ టీచర్)

SURYAPETA: చిన్ననాటి నుంచి చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే జీవితంలో స్థిరపడేందుకు ఆటలను పక్కనపెట్టిన విజయ..తాను అనుకున్నట్లుగా ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు. అయినా క్రీడల పట్ల ఇష్టంతో పోటీలకు సిద్ధం అవుతున్నారు.

ఇంకా చదవండి ...

(Nagaraju,News18, Nalgonda)

ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు(Lady Teacher)..అయితేనేం క్రీడ పట్ల ఆసక్తితో అద్భుతంగా రాణిస్తున్నారు. సూర్యాపేట(Suryapeta)జిల్లా హుజుర్ నగర్(Huzur Nagar)పట్టణానికి చెందిన దొడ్లపాటి విజయ(Dodlapati Vijaya), టీచర్‌గా కొనసాగుతూనే నిరంతరం సాధన చేస్తూ మాస్టర్స్ అథ్లెటిక్స్(Masters Athletics)క్రీడల్లో ప్రతిభ చాటుతున్నారు. చిన్నతనంలో క్రీడల పట్ల ఇష్టం పెంచుకున్న ఆమె..అప్పటి పరిస్థితుల దృష్ట్యా..అటుగా అడుగులు వేయలేకపోయారు. ఇంతలో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన విజయ.. తన చిన్ననాటి అభిరుచిని కొనసాగిస్తూ మాస్టర్స్ అథ్లెటిక్స్ లో మంచి విజయాలు సాధిస్తున్నారు.

ఉపాధ్యాయురాలిగా స్థిరపడిన విజయ:

దొడ్లపాటి విజయ వృత్తి రీత్యా టీచర్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణానికి చెందిన ఆమె అక్కడే చదువుకున్నారు. చిన్ననాటి నుంచి ఆటలంటే ఎంతో ఇష్టం. చదువుతో పాటు ఆటల్లోనూ రాణిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే జీవితంలో స్థిరపడేందుకు ఆటలను పక్కనపెట్టిన విజయ..తాను అనుకున్నట్లుగా ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం బద్దుతండా ప్రాథమిక పాఠశాల్లో విజయ విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయురాలిగా కొనసాగుతూనే..ఆటల పోటీల్లో పాల్గొనాలని అటుగా దృష్టిసారించారు.

రాష్ట్ర, జాతీయ స్థాయి ఆటల పోటీల్లో విజయాలు:

ఇటు టీచర్ వృత్తితో పాటు అటు మాస్టర్స్ అథ్లెటిక్ క్రీడల్లో పాల్గొనాలని సాధన చేశారు విజయ. ఈక్రమంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. తెలంగాణ సహా హరియాణా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని పసిడి, వెండి పతకాలతో పాటు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. గత మే నెలలో కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించిన మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున బరిలో నిలిచిన విజయ.. మంచి ప్రతిభ కనబర్చారు. హర్డిల్స్ 400 మీటర్ల(జంపింగ్ హుమ్) విభాగంలో బంగారు పతకం..2000 మీటర్ల పరుగు విభాగములో వెండి పతకం సాధించారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడల్లో రాణిస్తున్న టీచర్ విజయను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం అభినందించారు. జిల్లా, మండల స్థాయిలోనూ పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు విజయ టీచర్‌ను ప్రశంసించి సన్మానించారు.

ఇది చదవండి: పిల్లల్ని గవర్నమెంట్‌ స్కూల్‌లో చేర్పిస్తే నగదు, కానుకలు ఇస్తున్న సర్పంచ్ ..అంతర్జాతీయ పోటీలకూ ఎంపిక:

మాస్టర్స్ అథ్లెటిక్ క్రీడల్లో రాణిస్తున్న ఉపాధ్యాయురాలు విజయ, జాతీయ స్థాయిలో మంచి విజయాలు సాధించడంతో పాటు అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. 2019లో మలేసియాలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి.. ప్రపంచ పోటీలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఆగస్టు - సెప్టెంబర్ నెలలో జపాన్ దేశంలో జరుగనున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొననున్నారు. ఫిన్లాండ్ దేశంలో అక్టోబర్ - నవంబర్ నెలలో జరగనున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో భారత్ తరపున విజయ ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఇది చదవండి : ఆ పెద్దాయనకు భార్య అంటే ఎంతో ఇష్టం .. అందుకే ఆ పని చేశాడుప్రభుత్వం సాహకారం అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తా: 

మాస్టర్స్ అథ్లెటిక్ విభాగంలోనూ హర్డిల్స్ , లాంగ్ జంప్, షాట్ పుట్, పరుగు పందెంలో ప్రతిభ కనబరుస్తున్న విజయ, పాఠశాల విధులు ముగించుకున్నాక ప్రత్యేక అనుమతితో భువనగిరి పట్టణంలోని హనుమాన్ వాడా ప్రాథమిక పాఠశాలలో డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం డిప్యూటేషన్ రద్దు కావటంతో బద్దుతండాలోనే విధులు నిర్వహిస్తున్నారు. క్రీడల పట్ల తనకున్న ఆసక్తిని గమనించి, తాను సాధించిన విజయాలను గుర్తించి ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని విజయ \"న్యూస్ 18\" ప్రతినిధితో చెప్పుకొచ్చారు.

First published:

Tags: Local News, Suryapeta, Teacher

ఉత్తమ కథలు