హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime News : రోజూ ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని టార్చర్ పెట్టాడు .. కుదరని చెప్పడంతో ..

Crime News : రోజూ ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని టార్చర్ పెట్టాడు .. కుదరని చెప్పడంతో ..

(hyderabad rape)

(hyderabad rape)

Crime news: భర్త లేని మహిళా అనే జాలి కూడా చూపలేదు. కూలీ చేసుకుంటూ బిడ్డల్ని పోషిస్తున్న వితంతు మహిళపనే కన్నేశాడు. కోరిక తీర్చమని వేధించాడు. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో చివరకు మత్తు మందు ఇచ్చి ..అంతటి దారుణానికి పాల్పడ్డాడు.

ప్రభుత్వం ఉద్యోగం(Government Job)చేసుకుంటూ గౌరవంగా బ్రతకాల్సిన వాడు..కామాంధుడిగా మారాడు. శారీరక వాంచ తీర్చుకోవడం కోసం ఓ భర్త చనిపోయిన మహిళపై కన్నేశాడు. ఇష్టం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా తన కోరిక తీర్చమంటూ పదే పదే ఆమెను బ్లాక్‌మెయిల్(Blackmail)చేశాడు. చివరకు ఆ ప్రభుత్వ ఉద్యోగి అరాచకం పరాకాష్టకు చేరింది. ఒంటరిగా ఉన్న మహిళపై కామోన్మాది మాటల్లో చెప్పనంత నీచానికి పాల్పడ్డాడు. కామాంధుడి చేతిలో గాయపడిన బాధితురాలు పోలీసుల(Police) ముందు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్న సంఘటన నల్లగొండ(Nalgonda)జిల్లాలో జరిగింది.

కామోన్మాది..

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా ఉద్యోగం చేస్తున్న ముడావత్ చందూలాల్‌ మానవమృగంలా ప్రవర్తించాడు. నల్లగొండ జిల్లా డిండి మండలం జేత్యతండాకు చెందిన 28సంవత్సరాల మహిళ భర్త చనిపోవడంతో ఆరు సంవత్సరాల క్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకొని శంషాబాద్‌కు వచ్చి కూలీ చేసుకొని బ్రతుకుతోంది. 40సంవత్సరాల చందులాల్ బాధిత మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అదే చనువుతో ఆమెను శారీరక కోరిక తీర్చమని వేధించసాగాడు. బాధిత మహిళ చందులాల్‌ కోరికను తిరస్కరించడంతో మరింత తెగించాడు.

వితంతు మహిళపై బలాత్కారం..

రెండు నెలల క్రితం బాధితురాలు పిల్లలను తీసుకొని తన స్వగ్రామానికి వెళ్లింది. చందులాల్‌ ఆమెను ఎలాగైనా అనుభవించాలనే కోరికతో గత నెల 27వ తేదిన కర్చీఫ్‌కి మత్తు మందు స్ప్రే చేసుకొని అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. తలుపు తీయగానే మత్తు మందు పూసిన క్లాత్‌ను ఆమె ముఖానికి అడ్డుగా పెట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. వితంతు మహిళ మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు చందులాల్. అటుపై ఆమెను వివస్త్రను చేసి ఫోటోలు తీశాడు.

Telangana : అక్కడ మంకీపాక్స్ కంటే అవే ఎక్కువ భయపెడుతున్నాయి .. గడప దాటాలంటే గజగజ వణుకుతున్నారుమత్తు మందు ఇచ్చి ఘాతుకం..

భర్త చనిపోయిన మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడమే కాకుండా ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలను వాట్సాప్‌ ద్వారా ఆమెకు పంపాడు. అత్యాచారం చేసిన విషయం ఎవరికైనా చెబితే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చాడు. నిందితుడి చేసిన దారుణానికి మానసికంగా కుమిలిపోయిన బాధిత మహిళ ఈనెల 23వ తేదిన శంషాబాద్‌ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటన జరిగిన పరిధిలోని డిండి పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. అక్కడి పోలీసులు కామాంధుడ్ని సోమవారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. నిందితుడు నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అప్పాయపల్లి గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అతడిని రిమాండ్‌కు తరలించినట్లుగా ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Crime news, Nalgonda, Telangana crime news

ఉత్తమ కథలు