హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజాగాయకుడు .. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా గద్దర్ ప్రచారం షురూ

Munugodu : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజాగాయకుడు .. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా గద్దర్ ప్రచారం షురూ

GADDAR(FILE)

GADDAR(FILE)

Munugodu: మునుగోడులో కొత్తగా తెలంగాణలో డాక్టర్ కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. అంతే కాదు ఇక్కడ ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి కూడా రాజకీయాలతో సంబంధం లేని వారు కావడంతో ఆ పార్టీపై కొంత ఆసక్తి నెలకొంది. ఇంతకీ ఆయన ఎవరో కాదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

ఈమధ్య కాలంలో తెలంగాణలో ఉపఎన్నిక వచ్చిందంటే ఏదో ప్రత్యేకత ఉంటూనే ఉంది. హుజురాబాద్‌( Huzurabad)నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఈటల పార్టీ మారడంతో అక్కడ బైపోల్ అనివార్యమైంది. ఇప్పుడు మునుగోడులో అదే పరిస్థితి నెలకొంది. రాజగోపాల్‌రెడ్డి(Rajagopal Reddy)కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరడంతో ఇక్కడ ఉపఎన్నిక జరుగుతోంది. ఇందులో భాగంగానే శుక్రవారం ఉపఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. అయితే ఇప్పటి వరకు తెలంగాణలో స్థానిక, జాతీయ పార్టీలతో కలుపుకొని నాలుగు, ఐదు బరిలో ఉండేవి. కాని ఈసారి మునుగోడు(Munugodu)లో కొత్తగా తెలంగాణలో డాక్టర్ కేఏ పాల్(KA Paul)స్థాపించిన ప్రజాశాంతి(Prajashanti Party)పార్టీ బరిలోకి దిగుతోంది. అంతే కాదు ఇక్కడ ఆ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న వ్యక్తి కూడా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో ఆ పార్టీపై కొంత ఆసక్తి నెలకొంది. ప్రజాగాయకుడిగా, విప్లవ నాయకుడిగా పేరున్న గద్దర్(Gaddar)మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణలోని అనేక పార్టీలు తమతో చేతులు కలపాలని ఆహ్వానించినా కేఏ పాల్ పిలుపు మేరకు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రజాశాంతి పార్టీలో చేరినట్లుగా గద్దర్ ప్రకటించారు. శుక్రవారం నుంచి ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టనున్నారు.

Munugode By-poll: మునుగోడు పోరుకు నేటి నుంచే నామినేషన్లు.. కేటీఆర్ , హరీష్ రావుకు కీలక బాధ్యతలు

ప్రజాగాయకుడి పొలిటికల్ ఎంట్రీ..

మునుగోడులో అక్టోబర్ 7వ తేది నుంచి ఉపఎన్నిక హడావుడి మొదలైంది. ఎన్నికల సంఘం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పోటీలో నిలిచే అభ్యర్ధులు ఇవాళ్టి నుంచి నామినేషన్‌లు దాఖలు చేయవచ్చు. అయితే ఇక్కడ నిన్న, మొన్నటి వరకు బీజేపీ , టీఆర్ఎర్, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీగా భావించారు. తాజాగా కేఏ పాల్‌ స్తాపించిన ప్రజాశాంతి పార్టీపై కూడా జనం దృష్టి పడింది. ఎందుకంటే ఆ పార్టీలో ప్రజాగాయకుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విట్టల్ రావు చేరడం...మునుగోడు నుంచి ఈ బైపోల్‌లో పోటీ చేస్తానని ప్రకటించడంతో కొంత ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు ప్రజా ఉద్యమాలు, విప్లవ పోరాటల్లో చురుగ్గా పాల్గొన్న గద్దర్ రాజకీయాల వైపు చూడలేదు. అలాంటి వ్యక్తి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నిలవడంతో చిన్న పార్టీగా ఉన్న ప్రజాశాంతిపై అంచనాలు పెరిగాయి. అయితే పోటీ చేసేందుకు కేఏ పాల్ గద్దర్ పేరు ప్రకటించడం...తాను పోటీ చేస్తాను కాని తన దగ్గర డబ్బులు లేవని ...ఎవరికి ఓట్ల కోసం డబ్బులు ఇవ్వలేనని కేవలం రాజ్యాంగాన్ని కాపాడటానికే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పడంతో మునుగోడు ఓటర్లను తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నట్లైంది. శుక్రవారం నుంచి ప్రచారానికి కూడా దిగుతున్నారు గద్దర్.

ఇవాళ్టి నుంచే ప్రచారం..

ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న గద్దర్‌కు ఎన్నికలు ముగిసే వరకు ఆయన వెంటే ఉంటానని చెప్పారు కేఏ పాల్. బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మద్దతు తమ పార్టీ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు కేఏ పాల్. నోటిఫికేషన్‌ విడుదలతో 14వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్లను చండూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్‌ అధికారి స్వీకరిస్తారు. రెండో శనివారంతో పాటు ఆదివారం సెలవు రోజులైనందున నామినేషన్లను స్వీకరించరు. మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి చండూరు మండల కేంద్రంగానే నామినేషన్ల స్వీకరణ కొనసాగిస్తున్నారు.

బైపోల్‌లో గెలిచేదెవరో..

మునుగోడు నియోజకవర్గం నల్లగొండ , యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఏడు మండలాలు, రెండు మునిసిపాలిటీల పరిధిలో విస్తరించి ఉంది. మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, గట్టుప్పల్‌ మండలాలు నల్లగొండ జిల్లా పరిధిలోకి వస్తుండగా, చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం మండలాలు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తున్నాయి. నియోజకవర్గంలో 2,27,265 ఓట్లు ఉన్నాయి. ఇందులో కేవలం 32,407ఓట్లు మాత్రమే చౌటుప్పల్‌, చండూరు మునిసిపాలిటీల పరిధిలో ఉన్నాయి.

Telangana: ఏపీ, తెలంగాణ మధ్య పోలవరం పంచాయితీ .. ప్రాజెక్టుతో భద్రాచలానికి ఢోకా లేదన్న కేంద్రం

13వ సారి ఎన్నిక..

1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగాయి. 66సార్లు కాంగ్రెస్‌, 5సార్లు సీపీఐ , ఒకసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవడం జరిగింది. 1967 నుంచి 1985 సంవత్సరం వరకు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విజయం సాధించారు. 1985 నుంచి సీపీఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణరావు మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. 1999లో కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి గోవర్థన్‌రెడ్డి విజయం సాధించగా, 2004 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి పల్లా వెంకట్‌రెడ్డి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో సీపీఐ నుంచి ఉజ్జిని యాదగిరిరావు పోటీ చేసి విజయం సాధించగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. 2018 సంవత్సరంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో జరుగుతున్న ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: Gaddar, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు