హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu : మునుగోడు బైపోల్‌లో టికెట్ ఆశిస్తున్నా ..TRSలో కొందరు నేతలకు కామన్‌ సెన్స్‌ లేదు : బూర నర్సయ్యగౌడ్

Munugodu : మునుగోడు బైపోల్‌లో టికెట్ ఆశిస్తున్నా ..TRSలో కొందరు నేతలకు కామన్‌ సెన్స్‌ లేదు : బూర నర్సయ్యగౌడ్

BOORA, JAGADISH(FILE)

BOORA, JAGADISH(FILE)

Boora Narsiah Goud: మునుగోడు ఉపఎన్నిక విజయం కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ జోడు మద్దెల్లా టీఆర్ఎస్‌ని విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కాబట్టి కామన్ అనుకొని లైట్‌గా తీసుకుంటే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీ టీఆర్ఎస్‌ అగ్రనేతలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏమన్నారో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

మునుగోడు(Munugodu)ఉపఎన్నిక విజయం కోసం అటు బీజేపీ(BJP), ఇటు కాంగ్రెస్‌(Congress)జోడు మద్దెల్లా టీఆర్ఎస్‌(TRS)ని విమర్శిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కాబట్టి కామన్ అనుకొని లైట్‌గా తీసుకుంటే ఇప్పుడు అధికార పార్టీకి చెందిన మాజీ ఎంపీ టీఆర్ఎస్‌ అగ్రనేతలపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికార పార్టీ బైపోల్ అభ్యర్ధిని ఖరారు చేయలేదు. ఆయన మాత్రం టిక్కెట్ ఆశిస్తున్నానని తన మనసులో మాట బయటపెట్టారు. అభ్యర్ధుల ఎంపిక విషయంలో గులాబీ బాస్ పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే అందులో తన పేరు లేదనే అపోహతోనే ఈవిధంగా బయటపడ్డారా అనే చర్చ మిగిలిన పార్టీల్లో జోరుగా జరుగుతోంది. టీఆర్ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌(Boora Narsiah Gou)ఎందుకు అంతలా టీఆర్ఎస్‌ నేతల్ని తిట్టిపోశారని సొంత పార్టీ నాయకులు, క్యాడర్ చెవులు కొరుక్కుకుంటున్నాయి.

VRA Suicide : వీఆర్ఏ సూసైడ్‌తో అక్కడ టెన్షన్ వాతావరణం .. శవంతోనే ఆందోళనలుఅధికార పార్టీలో అసంతృప్తి..

తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక గెలుపు అధికార టీఆర్ఎస్‌కి ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీని ఎలాగైనా ఓడించాలనే ఆలోచనతో ఓ మెట్టు దిగి మరీ కమ్యునిస్టు పార్టీల మద్దతును కూడగడుతోంది. కాని సొంత పార్టీకి చెందిన నేతల్లో ఉన్న వ్యతిరేకతను మాత్రం పసిగట్టలేకపోతోంది. టీఆర్ఎస్‌ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. మునుగోడులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మాజీ ఎంపీ గులాబీ పార్టీలో ఉన్న కొందరు నేతలకు ఇంగితజ్ఞానం లేదని ఇంగ్లీష్‌లో తిట్టిపోశారు. ఒకరకంగా నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్న మంత్రి జగదీష్‌రెడ్డినే టార్గెట్ చేసినట్లుగా ఆయన మాటలను బట్టి చూస్తే అర్ధమవుతోంది.

మాజీ ఎంపీ మాటలకు అర్ధమేంటి..?

ఓ మంచి డాక్టర్‌గానే కాకుండా గతంలో ఎంపీగా గెలిచి టీఆర్ఎస్‌ పార్టీలో ఎంతో కొంత పేరు సంపాధించుకున్నారు బూర నర్సయ్యగౌడ్. మునుగోడులో బీసీ సామాజిక వర్గం బలంగా ఉందని, ఆ ఈక్వేషన్స్‌తోనే తాను టికెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. బలమైన బీసీ నేతనని తెలిసినా తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ. అయితే మునుగోడు ఉపఎన్నికను మంత్రి జగదీశ్వర్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారని నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలపై తనకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదో ఆయన్నే అడగాలని పేర్కొన్నారు.

Miniature Sculpture: పెన్సిల్‌ లిడ్‌పై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ .. అద్భుతం ఆ సూక్ష్మశిల్పంటికెట్‌ ఆశిస్తున్న బూర..

తనకు పదవి ఉన్నా ...లేకపోయినా ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. తనకు కాకుండా మరెవరికి టికెట్ వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదని కేసీఆర్ దిశానిర్దేశంతోనే పని చేస్తానన్నారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డిని విమర్శిస్తూనే కేసీఆర్‌ని ఆకాశానికి ఎత్తారు మాజీ ఎంపీ. మునుగోడు ఉపఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని..టీఆర్ఎస్‌ పార్టీనే గెలుస్తుందనే సర్వేలు కూడా చెబుతున్నాయని బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.

జిల్లా మంత్రిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు..

అయితే ఇక్కడ పోటీ చేసే అభ్యర్ధి ఎవరైనా కావచ్చు కాని కేసీఆర్‌ని చూసే మునుగోడు ప్రజలు ఓట్లు వేస్తారని స్పష్టం చేశారు. అంతే కాదు గులాబీ పార్టీలో లాబీయింగ్‌ నడవదని అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీఆర్‌ నిర్ణయమే ఫైనల్ అన్నారు మాజీ ఎంపీ. మునుగోడు పేరులొనే గోడు ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 33 గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినప్పటికి మునుగోడుకు జూనియర్ కాలేజీ రాలేదన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని పరోక్షంగా మంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Munugode Bypoll, Telangana Politics, TRS leaders

ఉత్తమ కథలు