హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gaddam Rudramadevi: మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి కన్నుమూత..చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం

Gaddam Rudramadevi: మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి కన్నుమూత..చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం

గడ్డం రుద్రమదేవి

గడ్డం రుద్రమదేవి

నల్గొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Nalgonda

నల్గొండ మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమదేవి (Gaddam Rudramadevi) కన్నుమూశారు. గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు రుద్రమదేవి (Gaddam Rudramadevi) కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు. అలాగే మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy), ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (MLA Kancharla Bhupal Reddy) సహా పలువురు సంతాపం తెలిపారు. కాగా 1985లో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్టీ రామారావు (Nandamuri Taraka Ramarao) రాజీనామా అనంతరం రుద్రమదేవి (Gaddam Rudramadevi) పోటీ చేసి ఘన విజయం సాధించారు.

Drugs: హైదరాబాద్ లో కలకలం..రూ.10 కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్..న్యూ ఇయర్ వేడుకలు నేపథ్యంలోనే..

ఎన్టీ రామారావు పిలుపుతో రాజకీయాల్లోకి రుద్రమదేవి..

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు NT రామారావు (Nandamuri Taraka Ramarao) పిలుపుతో గడ్డం రుద్రమదేవి (Gaddam Rudramadevi) రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత టీడీపీలో సుదీర్ఘకాలం వున్న ఆమె నల్గొండ మున్సిపాలిటీ నుండి 20 ఏళ్లకే కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. కాగా ఆ తరువాత 1830లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆమె తన ప్రత్యర్థి గుత్తా మోహన్ రెడ్డి  (Gutta Mohan Reddy)  చేతిలో ఓడిపోయారు.

గడ్డం రుద్రమదేవి ఫోటో

Cm Kcr: సీఎం కేసీఆర్ కు ఢిల్లీ అధికారుల షాక్..BRS ఫ్లెక్సీల తొలగింపు

సంక్షోభంలో టీడీపీ ప్రభుత్వం మధ్యంతర ఎన్నికలు..

అయితే 1835లో టీడీపీ ప్రభుత్వం సంక్షోభంలో ఉండడంతో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) మూడు చోట్ల పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తరువాత నల్గొండ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. దీనితో నల్గొండ స్థానానికి ఉపఎన్నికల అనివార్యం అయింది. 1835లో జరిగిన ఉపఎన్నికలో గడ్డం రుద్రమదేవి (Gaddam Rudramadevi) విజయం సాధించారు. అయితే 1833లో గుత్తా మోహన్ రెడ్డి (Gutta Mohan Reddy) చేతిలో ఓడిపోగా ఈసారి అదే అభ్యర్థిపై ఆమె విజయం సాధించారు.

గడ్డం రుద్రమదేవి  (Gaddam Rudramadevi) మృతితో నల్గొండలో విషాధచాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆమె ఇంటికి భారీగా వస్తున్నారు. ఆమె మృతి పట్ల నల్గొండ జిల్లా నాయకులు సహా పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రుద్రమదేవి  (Gaddam Rudramadevi) అంత్యక్రియల నిర్వహణపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

First published:

Tags: Nalgonda, TDP, Telangana, Telangana News

ఉత్తమ కథలు