ఓ కార్యక్రమానికి హాజరైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ (JD Lakshmi Narayana) కోపం కట్టలు తెంచుకుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆయన ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. మరి ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే ఆయనకు అంతలా కోపం రావడానికి గల కారణం ఎవరు? అసలు ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సామూహిక జనగణమన కార్యక్రమం ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిన సందర్బంగా నల్గొండ జిల్లాలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ (JD Lakshmi Narayana) ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అలాగే పలు విద్యాసంస్థల నుండి భారీగా విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ విద్యార్థిని దేశభక్తి గురించి ప్రసంగిస్తుంది.
ఈ క్రమంలో కొందరు పోకిరీలు న్యూసెన్స్ చేశారు. ప్రసంగిస్తున్న విద్యార్థినిని అక్కడే ఉన్న మరికొంతమంది విద్యార్థులు గేలి చేశారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) పోకిరీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్ తీసుకున్న ఆయన పోకిరీల చేష్టలను తప్పుబట్టారు. విద్యార్థిని ప్రసంగించే సమయంలో కొందరు న్యూసెన్స్ చేశారు. నేను వారిని గమనించాను. ఇప్పటికే ఏం సాధించారని అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. పిల్లి కూతలు, కారు కూతలు కూసిన వారు సమావేశం నుండి వెళ్లిపోవాలని అన్నారు. ఈ తరహా పద్ధతులు మానుకోవాలని లక్ష్మీ నారాయణ (JD Lakshmi Narayana) విద్యార్థులకు సూచించారు.
అంతటితో ఆయన ఆగలేదు. ఒక అమ్మాయి ఎంతో దైర్యంగా వచ్చి మాట్లాడుతుంటే మీరు వెనక కూర్చుని పిల్లి కూతలు కుక్క కూతలు కూస్తున్నారు. తీయండి వాడిని బయటకు. ఇలాంటి వారు ఉన్నారు కాబట్టే ఇంకా ఈ దేశం ఇలా ఉంది. అప్పటినుండి చూస్తున్న ఆ అమ్మాయిల వరుస వెనకాల కూర్చున్న వారు విద్యార్థుల్లా ఉన్నారా. ఏం సాధించారని ఇంతలా గర్వపడుతున్నారని విద్యార్ధులపై లక్ష్మీ నారాయణ (JD Lakshmi Narayana) మండిపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JD Lakshmi Narayana, Nalgonda, Telangana