హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: భారీగా గంజాయి పట్టివేత, కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి, వృద్ధుడి హత్య: నల్గొండలో నేరాలు

Nalgonda: భారీగా గంజాయి పట్టివేత, కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి, వృద్ధుడి హత్య: నల్గొండలో నేరాలు

భారీగా గంజాయి పట్టివేత, కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి, వృద్ధుడి హత్య

భారీగా గంజాయి పట్టివేత, కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి, వృద్ధుడి హత్య

సరికొత్త ఎత్తుగడలతో అధికారులను బురిడి కొట్టిస్తోంది మత్తు మాఫియా. ఉమ్మడి జిల్లాలో వారం రోజుల్లో రూ.1.20 కోట్ల గంజాయి పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి, ఏనుబాముల గ్రామంలో దారుణ హత్య ఇవి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేరాలు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda | Telangana

(Nagaraju, News 18, Nalgonda)

ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. సరికొత్త ఎత్తుగడలతో అధికారులను బురిడి కొట్టిస్తోంది మత్తు మాఫియా. ఉమ్మడి జిల్లాలో వారం రోజుల్లో రూ.1.20 కోట్ల గంజాయి పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్టు, కోర్లపహడ్, పంతంగి, టోల్ ప్లాజల వద్ద నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. తాజాగా గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పొనుగోడు నుంచి నల్లగొండ జిల్లా మీదుగా కారులో గంజాయిని హైదరాబాద్ తరలిస్తు కర్ణాటకకు చెందిన డ్రైవర్ పోలీసులకు చిక్కాడు. చెక్ పోస్టుల గస్తీ పెరగడంతో.. ఇలా సరికొత్త దారిని ఎంచుకున్నట్లు కారు డ్రైవర్ విచారణలో తెలుపడంతో పోలీసులు విస్తుపోయారు. ఇప్పటికే గంజాయి తరలిస్తున్న ముఠాలు, ఆంధ్ర, ఒడిశా సరిహద్దు, విశాఖ, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల నుంచి హైదరబాద్,  ముంబాయికి చేరవేయడానికి గత కొన్నేళ్లుగా జాతీయ రహదారిని ఉపయోగిస్తున్నారు. వీరికి కర్ణాటక, మహరాష్ట్ర, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొన్ని ముఠాలు సహాయం చేస్తున్నారు.

కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి:

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సంగారం స్టేజీ సమీపంలో చోటు చేసుకుంది. పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల పరిధిలోని గడ్డమీది తండాకు చెందిన రమావత్ కిషన్, హాస్టల్ లో చదువుతున్న తన కుమారుడిని చూసేందుకు బుధవారం తన ద్విచక్రవాహనంపై వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో సంగారం స్టేజి వద్దకు చేరుకుంటున్న క్రమంలో వేగంగా వచ్చిన కారు కిషన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కిషన్ ను, దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఏనుబాముల గ్రామంలో దారుణ హత్య:

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని ఏనుమాముల గ్రామంలో వత్సవాయి మల్లయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు కత్తులతో దాడి చేసి మల్లయ్యను హతమార్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Drug case, Murder, Nalgonda, Telangana

ఉత్తమ కథలు