హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG : మృత శిశువును పీక్కుతిన్న కుక్కలు, పందులు .. ఆ హాస్పిటల్‌లో అందరూ చూస్తుండగనే జరిగింది

OMG : మృత శిశువును పీక్కుతిన్న కుక్కలు, పందులు .. ఆ హాస్పిటల్‌లో అందరూ చూస్తుండగనే జరిగింది

baby(file photo)

baby(file photo)

Sad news: నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన మహిళ ప్రసవించిన కొద్ది రోజుల్లోనే బిడ్డను దూరం చేసుకుంది. ఈదారుణ సంఘటన వెనుక ఆసుపత్రి డాక్టర్లే కాదు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

నల్గొండ (Nalgonda)జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో కాన్పు కోసం వచ్చిన మహిళ ప్రసవించిన కొద్ది రోజుల్లోనే బిడ్డను దూరం చేసుకుంది. ఈదారుణ సంఘటన వెనుక ఆసుపత్రి డాక్టర్లే (Doctors)కాదు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈసంఘటనపై ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుకు పేషెంట్ల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఇదే ఆసుపత్రిలో తొలి కాన్పు కోసం వచ్చిన గర్భిణిని కడుపుపై నర్సులు తొక్కడంతో పసికందు మృతి చెందిన సంఘటన మర్చిపోక ముందే ఈదారుణం వెలుగులోకి రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Unesco | Telangana : సిద్దిపేట నేతన్నల కృషికి యునెస్కో గుర్తింపు .. గొల్లభామ చీరలకు అరుదైన గౌరవం

ఆసుపత్రి ఆవరణలో దారుణం..

కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్న తీరు...రోగులపై వైద్య సిబ్బంది చూపిస్తున్న శ్రద్ద చూస్తుంటే వైద్యో నారాయణో హరి అన్న నానుడే నిజమనిపిస్తోంది. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాత , శిశు సంరక్షణ కేంద్రంలో అమానుష ఘటన అందర్ని విస్మయానికి గురి చేసింది. కేవలం 34వారాల వయసున్న శిశువును కుక్కలు, పందులు లాక్కెళ్లాయి. ఈసంఘటన ఆసుపత్రిలోని రోగులు, సిబ్బంది చూసి అడ్డుకునే ప్రయత్నం చేసేలోపే కుక్కలు, పందులు మృత శిశువు ఎడమ చేయిని పూర్తిగా తినేశాయి. కుక్కలు పీక్కుతిన్నది ఆడ మృతశిశువుగా గుర్తించారు.

మృత శిశువును పీక్కుతిన్న కుక్కలు..

అందరూ చూస్తుండగా ఓ పసికందు వీధి కుక్కలకు ఆహారంగా మారడం చూసిన రోగులు మండిపడుతున్నారు. అయితే మృత శిశువు ఆసుపత్రిలో చనిపోతే అక్కడ పడేశారా లేక బయట నుంచి కుక్కలే తీసుకొచ్చి అక్కడ పీక్కు తిన్నాయా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఆసుపత్రికి హ్యూమన్‌ రైట్స్ కమీషన్ చెర్మన్ వచ్చిన రోజే ఈసంఘటన చోటుచేసుకోవడంతో ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్య సిబ్బంది, సెక్యురిటీ సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తాయి.

OMG : చిన్న కొడుకు సహాయంతో పెద్దకొడుకుని కడచేర్చిన కన్నతల్లి .. వాళ్ల మధ్య అసలేం జరిగిందంటే..

నెల రోజుల్లో రెండో ఘటన..

నెల రోజుల క్రితం ఇదే ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రసూతి మహిళ గర్భంలోనే బిడ్డను కోల్పోయింది. ఆ సంఘటన మర్చిపోక ముందే మరోసారి మృత శిశువును కుక్కలు, పందులు పీక్కు తిన్న ఘటనపై ప్రజా సంఘాలు, రోగులు మండిపడుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Government hospital, Nalgonda, Telangana News

ఉత్తమ కథలు