హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: కోరలు చాస్తున్న విష జ్వరాలు: నల్గొండ జిల్లా పరిధిలో చాపకింద నీరులా 'డెంగీ'

Nalgonda: కోరలు చాస్తున్న విష జ్వరాలు: నల్గొండ జిల్లా పరిధిలో చాపకింద నీరులా 'డెంగీ'

X
(Dengue

(Dengue Fever)

Nalgonda: కలుషిత నీరు, పెరుగుతున్న దోమల కారణంగా జిల్లాలో జ్వర పీడితులు పెరిగిపోతున్నారు. సీజన్లో వచ్చే వ్యాధుల కారణంగా ఆస్పత్రి బాట వాడపడుతున్న వారి సంఖ్య రోజరోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా పరిధిలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి.

ఇంకా చదవండి ...

(Nagaraju,News18,Nalgonda)

వారం పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వరదల ధాటికి అన్ని జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉమ్మడి నల్గొండ(Nalgonda)జిల్లాలో ఎడతెరిపిలేని వానలు ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తోంది. కలుషిత నీరు, పెరుగుతున్న దోమల కారణంగా జిల్లాలో జ్వర పీడితులు పెరిగిపోతున్నారు. సీజన్లో వచ్చే వ్యాధుల కారణంగా ఆస్పత్రి బాట వాడపడుతున్న వారి సంఖ్య రోజరోజుకూ పెరుగుతుంది. ముఖ్యంగా నల్గొండ జిల్లా పరిధిలో విష జ్వరాలు(Poisonous fevers)ప్రబలుతున్నాయి. చాపకింద నీరులా డెంగ్యూ(Dengue) కోరలు చాస్తోంది. ఇతర సీజనల్ వ్యాధులు(Seasonal diseases)వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమంది.

Telangana : గూగుల్ మ్యాప్ చూస్తూ గప్పాలు కొట్టుడు కాదు కేసీఆర్ వరద బాధితులను ఆదుకో: YS షర్మిలపెరుగుతున్న డెంగీ కేసులు:

నల్గొండ జిల్లా వ్యాప్తంగా డెంగీ విస్తరిస్తోంది. గత కొన్ని రోజులుగా డెంగీ లక్షణాలతో ఆసుపత్రుల బాట పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ విషయాన్నీ అధికారులు అధికారికంగా వెల్లడించనప్పటికీ...జిల్లాలోని పలు ఆసుపత్రుల్లో ఉన్న సమాచారం మేరకు కేసులు సంఖ్య బాగా పెరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటున్న వైద్యులు...వ్యాధుల నివారణకు తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించింది. రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. అక్కడి ప్రజలను అప్రమత్తం చేసింది.

సీజనల్ వ్యాధులు రాకుండా వైద్యుల సూచనలు:

1 మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.

2. దోమల నియంత్రణకు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. రోడ్లకు ఇరువైపులా మోరీ, నేటి మడుగులు, ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

3. ఇంట్లో చేసిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బయట ఆహారానికి కొద్ది రోజులు దూరంగా ఉండాలి. కాచి చల్లార్చి వడపోసిన నీటిని తీసుకోవాలి.

4. ఇంటి సమీపంలో సీజనల్ వ్యాధుల భారిన పడిన వారిని గుర్తిస్తే వెంటనే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. దీంతో ఆ ప్రాంతంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు.

5. దోమ కుట్టిన వారం లోపు సమస్య లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. కళ్ళు తిప్పడం, శరీరంపై దద్దుర్లు వస్తుంటే డెంగీ నిర్దారణగా భావించి వైద్యులను సంప్రదించాలి.

అవగాహన ముఖ్యం:

నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ స్వప్న వివరించారు. అవసరమైన మేరకు రోగులకు అన్నిరకాల మందులు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ స్వప్న పేర్కొన్నారు. వ్యాధులు సోకి ఆసుపత్రికి రావడం కంటే..వ్యాధుల భారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆమె సూచించారు.

GOVERNMENT MEDICAL COLLEGE NALGONDA


బాధితులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:

అనుకోని విధంగా వ్యాధుల భారిన పడిన వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. డెంగీ జ్వరం బారిన పడిన వారి రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గడం కనిపించే ప్రధాన సమస్య. ప్లేట్ లెట్స్ 10 వేల కంటే తగ్గినప్పుడు ఈ సమస్య ప్రమాదకరంగా మారుతుంది. ఇక రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారు ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో శ్రద్ధ పాటించాలి. శరీరానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంపొందిం చేందుకు.. ఉదయం లేచిన వెంటనే వేడి నీటిలో కొద్దిగా మిర్యాల పొడి వేసుకొని తాగాలి. ప్రతి రోజూ ఉడకబెట్టిన గుడ్డు తినాలి. అల్పాహారంలో జొన్న లేదా గోధుమ రొట్టెలు, రాగి జావ, జొన్నజావ వంటి ఆహారం తీసుకోవాలి. మధ్యాహ్న భోజనంలో అన్నం, చపాతి తాజా ఆకుకూరలు ఉడికించినవై ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగతంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన రోగాలు ధరి చేరకుండా కాపాడుకోగలం.అత్యవసర సమయంలో ప్రజలు నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించవచ్చు.ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిఫోన్ నెంబర్08682-220111

First published:

Tags: Local News, Nalgonda