హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu By Elections: తేల్చేసిన సీపీఐ..! మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు ఆ పార్టీకే.. 

Munugodu By Elections: తేల్చేసిన సీపీఐ..! మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు ఆ పార్టీకే.. 

సీపీఐ నారాయణ (ఫైల్)

సీపీఐ నారాయణ (ఫైల్)

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే రాజగోపాల్​ రాజీనామాతో పోటాపోటీ బహిరంగ సభలతో  మునుగోడు ఉపఎన్నికల వేడి రాజుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యే రాజగోపాల్​ రాజీనామాతో పోటాపోటీ బహిరంగ సభలతో  మునుగోడు ఉపఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే మునుగోడు (Munugodu Bypoll)లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఏర్పాటు చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఆ సభకు హాజరయ్యారు. ఇప్పుడు టీఆర్ఎస్ (TRS), బీజేపీల వంతు వచ్చింది. శనివారం టీఆర్ఎస్, ఆదివారం బీజేపీ సభలు తలపెట్టాయి. శనివారం మునుగోడులో జరగనున్న సభకు సీఎం కేసీఆర్ (CM KCR) హాజరుకానున్నారు. ఈ సభకు మనుగోడు ప్రజా దీవెన సభగా పేరు పెట్టారు. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో సభా ఏర్పాట్లను పూర్తి చేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాల కోసం 6 చోట్ల పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల్లో (Munugodu By elections) మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

  టీఆర్‌ఎస్‌ (TRS) పార్టీకి సీపీఐ (CPI) పార్టీ మద్దతు తెలిపినట్లు సమాచారం అందుతోంది. మునుగోడు ఎన్నికల ప్రచారానికి రావాలని సీపీఐ పార్టీని  సీఎం కేసీఆర్‌ కోరారు. అయితే గత రెండు రోజులుగా నారాయణ, చాడ తదితరులు ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే…మునుగోడు సభకు వెళ్లాలని సీపీఐ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  ఇవాళ సీఎం కేసీఆర్వాహనంలోనే చాడా వెంకట్‌ రెడ్డి.. మునుగోడు (Munugodu By elections) సభకు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాదు… మునుగోడు సభా వేదికను సీఎం కెసిఆర్, సీపీఐ చాడా వెంకట్ రెడ్డి పంచుకోనున్నారు. ఈ బహిరంగ సభలోనే.. టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. బీజేపీ పార్టీని ఓడించే ఏ పార్టీతో నైనా తాము పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గతం నుంచే సీపీఐ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సీనియర్​ నేతలు చాడ, నారాయణ తదితరులు కలిసి పార్టీ అంతర్గత చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు సీపీఎం కూడా టీఆర్‌ఎస్‌ పార్టీకే మద్దతు తెలిపే ఛాన్స్‌ ఉంది.

  Arogya sri: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేషన్​కార్డు లేకున్నా ఆరోగ్య శ్రీ.. వివరాలివే

  కాగా, సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలోనే హైదరాబాద్ (Hyderabad) నుంచి మునుగోడుకు వెళ్తారు. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్‌ నుంచి బయలుదేరి.. మధ్యా హ్నం 2 గంటల సమయంలో మునుగోడులోని సభా వేదికకు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలోనే వెళ్తుండడంతో.. ఆయన కాన్వాయ్ వెనక టీఆర్ఎస్ భారీ ర్యాలీ తలపెట్టింది. టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు రెండు వేలకుపైగా కార్లతో సీఎం కాన్వాయ్‌ను అనుసరించనున్నారు. ఇందులో వెయ్యి వాహనాలు జీహెచ్ఎంసీ (GHMC) పరిధి నుంచే బయలుదేరుతాయి. మరో వెయ్యి వాహనాలు వివిధ ప్రాంతాల నుంచి మార్గ మధ్యలో కలుస్తాయి.

  హైదరాబాద్‌ నలుమూలల నుంచి వచ్చే కార్లు, వాహనాలు మధ్యాహ్నం 12 గంటలకల్లా పెద్ద అంబర్‌పేటకు చేరుకునేలా ప్లాన్ చేసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా మునుగోడుకు వెళ్తారు. ఈ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు. హైదరాబాద్, పెద్ద అంబర్‌పేట్, పోచంపల్లి ఎక్స్‌ రోడ్, చౌటుప్పల్, నారాయణపూర్, చల్మెడ మీదుగా మునుగోడు వరకు ఈ ర్యాలీ జరుగుతుంది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, CPI, CPM, Munugodu By Election, Trs

  ఉత్తమ కథలు