హోమ్ /వార్తలు /తెలంగాణ /

Uttam Kumar Reddy : మంత్రిని బాహుబలి అని పొగిడిన జిల్లా ఎస్పీ.. నీకు ఎమ్మెల్సీ పదవి ఖాయమంటూ ఉత్తమ్‌ ట్వీట్

Uttam Kumar Reddy : మంత్రిని బాహుబలి అని పొగిడిన జిల్లా ఎస్పీ.. నీకు ఎమ్మెల్సీ పదవి ఖాయమంటూ ఉత్తమ్‌ ట్వీట్

UTTAM KUMARREDDY,SP

UTTAM KUMARREDDY,SP

Uttam Kumar Reddy: రాజకీయాల్లో నాయకుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సర్వ సాధరణమే. కాని సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో కొత్త అంశం ఇప్పుటు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నల్లొండ ఎంపీ కాంగ్రెస్‌ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Suryapet, India

తెలంగాణలో సెప్టెంబర్ 17ను అన్నీ రాజకీయ పార్టీలు వేర్వేరు పేర్లతో కార్యక్రమాలు నిర్వహించి ప్రజల అభిమానాన్ని చురగొనాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాల్లో ఓ ఎస్పీ అధికార పార్టీకి చెందిన నేత..అధికారంలో ఉన్న మంత్రిపై పొగడ్తల వర్షం కురిపించడంతో ప్రతిపక్ష నాయకులు ఆ పోలీస్ అధికారిని సోషల్ మీడియా(Social media) వేదికగా విమర్శించారు. ఇప్పుడు ఆ ఎస్పీ(SP)తీరును విమర్శిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిUttam Kumar Reddy చేసిన ట్వీట్‌(Tweet) తెగ వైరల్(Viral) అవుతోంది.

Hostel food : ఆ హాస్టల్‌లో పురుగులున్న అన్నమే పరమాన్నం.. తినలేక విద్యార్ధులు పస్తులుంటున్న వైనం

మీకిది తగునా ..

రాజకీయాల్లో నాయకుల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు సర్వ సాధరణమే. కాని సూర్యాపేట జిల్లా రాజకీయాల్లో కొత్త అంశం ఇప్పుటు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నల్లొండ ఎంపీ కాంగ్రెస్‌ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినోత్స‌వాల్లో ఎస్పీ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని బాహుబలిగా అభివర్ణించడాన్ని ఎంపీ ఖండించారు.

ట్వీట్‌తో సెటైర్..

ఒక పోలీస్ ఉన్నతాధికారి అయి ఉండి...యూనిఫామ్‌లో మంత్రికి ఓ భక్తుడిలా, టీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తల కీర్తించడం ఏమిటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అంతే కాదు ఎస్పీ ప్రసంగించిన వీడియోని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈసంఘటన అక్కడితో వదిలిపెట్టకుండా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో జరిగిన ఓ సంఘటనతో పోల్చారు. గ‌తంలో కేసీఆర్ కాళ్లు మొక్కిన ఐఏఎస్ అధికారికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్కిన‌ట్టే.. మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డిని కీర్తించిన ఐపీఎస్ అధికారికి కూడా ఎమ్మెల్సీ ప‌ద‌వి ద‌క్క‌డం ఖాయ‌మంటూ ఆయ‌న సెటైర్లు వేశారు.

KTR: శత్రుదేశం మీద దాడికి వచ్చినట్లు తెలంగాణకొస్తున్నారు: మంత్రి కేటీఆర్​

ఎస్పీకి ఎమ్మెల్సీ పదవి ఖాయం..!

పోలీస్ యూనీఫాంలో ఉన్న ఓ పోలీసు అధికారి బ‌హిరంగంగా ఇలా మంత్రిని కీర్తించ‌డం సిగ్గు చేట‌ని ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి విమ‌ర్శించడంపై నెటిజన్లు వేర్వేరుగా స్పందిస్తున్నారు. కొందరు సమర్ధిస్తూ కామెంట్స్ షేర్ చేస్తుంటే ...మరికొందరు ఉత్తమ్‌ ట్వీట్‌ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Suryapet, Telangana Politics, Uttam Kumar Reddy

ఉత్తమ కథలు