మునుగోడు(Munugodu)లో పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ టీఆర్ఎస్(TRS)కు ఎన్నికల కమిషన్ గట్టి దెబ్బ కొట్టింది. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి(Jagdish Reddy) 48గంటల పాటు ప్రచారం నిర్వహించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఉపఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న జగదీష్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు పాటించని కారణంగానే ఈవిధంగా ప్రచారంపై నిషేధం విదిస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
48గంటల పాటు నిషేధం..
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు మరో నాలుగు రోజులు టైమ్ ఉంది. సరిగ్గా అదే సమయంలో టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న మంత్రి జగదీష్‌రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ప్రచారం చేయకూడదని 48గంటల పాటు నిషేధించింది. ఈ రెండు రోజుల పాటు మంత్రి జగదీష్‌రెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎలాంటి ప్రసంగాలు, ప్రచారాలు చేపట్టకూడదని తెలిపింది. శనివారం సాయంత్రం ఏడు గంటల నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ రెండు రోజుల పాటు మంత్రి జగదీష్‌రెడ్డి పబ్లిక్ మీటింగ్స్, ప్రదర్శనలు, ర్యాలీలు, రోడ్‌షోలలో పాల్గొనకూడదు. అంతే కాదు ఎలాంటి ప్రెస్మీట్లు కూడా నిర్వహించకూడదని సీఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం..
మునుగోడులో గెలిచేందుకు టీఆర్ఎస్ మొదట్నుంచి దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ ప్రజలకు ఏమి చేయలేదనే మాటతో పాటు తాము చేసిన అభివృద్దిపై చార్జ్‌షీట్ వేసిన నాయకులు బీజేపీ తరపున నిలబడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కేవలం కాంట్రాక్టుల కోసమే అమ్ముడుపోయారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. తాజాగా శనివారం మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బీజేపీ మునుగోడు ఓటర్లు, నల్లగొండ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోందని బీజేపీపై ఆరోపణలు చేశారు.
బీజేపీ పెద్దలపై సెటైర్లు ..
నిన్నటి వరకు రాష్ట్ర బీజేపీ నేతలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని విమర్శించిన టీఆర్ఎస్ నేతలు..శనివారం నుంచి డైరెక్ట్‌గా బీజేపీ పెద్దలను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో బీజేపీ నేతల వేషాలు వేసుకొని మరీ ప్రదర్శనల ద్వారా ఓటర్లలో అవైర్నెస్ కల్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.