Home /News /telangana /

NALGONDA CASE AGAINST PARENTS WHO SOLD A BABY GIRL TO NALGONDA DISTRICT FOR GIVING BIRTH TO TWIN GIRLS SNR

Crime news : తమకు పుట్టిన కవల పిల్లల్ని వదిలించుకున్న దంపతులు .. కారణం అదేనంట

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Crime news: రెండో కాన్పులో కూడా ఆడపిల్లలే పుట్టారని తల్లిదండ్రులు దారుణానికి పాల్పడ్డారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డల్లో ఒకరిని వేరే వాళ్లకు దత్తతకు ఇచ్చి..మరో బిడ్డను మాయం చేశారు. ఇప్పుడు రెండో శిశువును ఏం చేశారనే విషయంపైనే ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇంకా చదవండి ...
సంతానం లేని ఎందరో దంపతులు బిడ్డలు పుడితే చాలు అని దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. పిల్లలు కలగడం కోసం డాక్టర్ల(Doctors)ను సంప్రదిస్తున్నారు. ఇంకొందరు పుట్టిన బిడ్డ ఆడ అయినా పర్వాలేదు, మగ అయితేనేం అని మురిసిపోతున్నారు. కాని నల్లగొండ(Nalgonda)జిల్లాలో మాత్రం ఓ దంపతులు కవల పిల్లలు పుడితే వాళ్లను అంగడి వస్తువులుగా మార్చినట్లుగా అధికారులు గుర్తించారు. పాపం, పుణ్యం తెలియని మొగ్గ ప్రాయంలోనే తల్లి నుంచి బిడ్డలను వేరు చేసి అమానుషంగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈఘటనపై పోలీసులు(Police) కేసు నమోదు చేశారు.

Telangana : కోడలికి మళ్లీ ఆడపిల్లే పుట్టింది .. కుటుంబ సభ్యుల రియాక్షన్ చూస్తే షాక్ అవుతారు



బిడ్డల్ని మాయం చేసిన తల్లిదండ్రులు..
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ఎర్రబిచ్చతండాకు చెందిన మూడావత్‌ గోపీ, కవిత దంపతులకు పదేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరూ కూలీ పనులు చేసుకొని జీవిస్తున్నారు. అయితే ఈదంపతులకు గతంలో ఒక ఆడపిల్ల జన్మించింది. రెండోసారి గర్భం దాల్చడంతో నెల 2వ తేదీన కవితను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు గోపి. కవితకు ఇద్దరు ఆడ కవలపిల్లు పుట్టారు. అయితే మమగ పిల్లవాడు పుడతాడని భావించిన తల్లిదండ్రులు మళ్లీ ఆడ పిల్లలు పుట్టడంతో నిరాశ చెందారు. అమ్మాయిలను పోషించడం ఇష్టం లేక ఎవరికైనా ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు.



లింగ వివక్షే కారణం ..
గోపి, కవిత ముందుగా అనుకున్నట్లుగానే ఇద్దరు ఆడ కవల పిల్లల్లో ఒకరిని కమలాపూర్‌కు చెందిన దంపతులకు దత్తతకు ఇచ్చారు. మరో బిడ్డను విక్రయించారు. టీకా వేసేందుకు ఈ నెల 18వ తేదీన అంగన్‌వాడీ టీచర్‌ కమలాబాయి తండాకు వెళ్లి కవల శిశువుల గురించి విచారించగా దంపతులు పిల్లలు చనిపోయారని చెప్పి నిజాన్ని దాచిపెట్టారు.య దీంతో అనుమానం వచ్చిన అంగన్‌వాడీ టీచర్‌... ఈ విషయాన్ని ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించారు. ఈ నెల 19వ తేదీన దేవరకొండ ఐసీడీఎస్‌ అధికారులు తండాకు వెళ్లి విచారించగా.. ఒక శిశువును దత్తతకు ఇచ్చినట్లుగా అంగీకరించారు.

Cheating couple : భర్త బిల్డప్ చూపించి భార్య బిజినెస్ .. 30కోట్లకుపైగా సంపాధించారు..వాళ్లేం చేశారో తెలుసా



మరో బిడ్డ ఆచూకి కోసం వెదుకులాట..
మరుసటి రోజు కమలాపూర్‌కు వెళ్లి అక్రమంగా దత్తత తీసుకున్న దంపతులపై కేసు దేవరకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ల దగ్గరున్న పసిబిడ్డను శిశుగృహకు తరలించారు. మిగిలిన మరో పాప సంగతి ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. మరో శిశువు కనిపించడం లేదని అంగన్‌వాడి టీచర్ దేవరకొండ పోలీస్‌లకు కంప్లైంట్ చేశారు. దాంతో గోపి తల్లిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కనిపించకుండా పోయిన రెండో శిశువు ఎక్కడ ఉంది..? ఎవరికి విక్రయించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కవల పిల్లల తండ్రి గోపికి మొదట వివాహం జరిగింది. మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో అదే తండాకు చెందిన కవితను రెండో పెళ్లి చేసుకున్నట్లుగా తేలింది.
Published by:Siva Nanduri
First published:

Tags: Nalgonda, Telangana crime news, Two childrens

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు