హోమ్ /వార్తలు /తెలంగాణ /

Petrol Free : కుమారుడి జ్ఞాప‌కార్ధం తండ్రి ఫ్రీ పెట్రోల్ సప్లై .. క్యూ క‌ట్టిన జ‌నం ఎక్కడంటే   

Petrol Free : కుమారుడి జ్ఞాప‌కార్ధం తండ్రి ఫ్రీ పెట్రోల్ సప్లై .. క్యూ క‌ట్టిన జ‌నం ఎక్కడంటే   

FREE PETROL

FREE PETROL

Petrol Free : కొడుకు జ్ఞాప‌కార్ధం సూర్య‌పేట‌కు చెందిన తండ్రి వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు చేయ‌ని విధంగా ఎవరి ఆలోచనలకు తట్టని విధంగా ఆలోచించి పెరిగిన పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు కాస్తంత ఉపశమనం కలిగించాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Suryapet, India

    (M.Balakrishna,News18,Hyderabad)

    కుటుంబ సభ్యులు లేదా మిత్రులు మ‌ర‌ణించిన త‌ర్వాత వారి జ్ఞాప‌కార్ధం పేదలకు, అనాథ శరణాలయాల్లో ఉన్న వారికి ఆహారం అందించం లేదా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు ఆహారాన్ని ఇవ్వ‌డం వంటివి చాలా చోట్ల జరుగుతుంది. అయితే ఇందంతా ఓల్డ్ మోడ‌ల్ అనుకున్నాడో ఏమో కాని మ‌ర‌ణించిన త‌న కొడుకు జ్ఞాప‌కార్ధం సూర్య‌పేట‌(Suryapet)కు చెందిన తండ్రి వినూత్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రు చేయ‌ని విధంగా ఎవరి ఆలోచనలకు తట్టని విధంగా ఆలోచించి పెరిగిన పెట్రోల్ (Petrol)ధరలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు కాస్తంత ఉపశమనం కలిగించాడు.

    Mirchi record price: బంగారం ధరను క్రాస్ చేసిన ఎర్రబంగారం .. క్వింటా ధర ఎంతో తెలుసా



    ఫ్రీగా పెట్రోల్ పంపిణి..

    ఎన్ని దానాలు చేసినా , ఎంత సేవ చేసినా పుణ్యం కోసమేనని అందరూ భావిస్తారు. సూర్యపేటకు చెందిన ఒక వ్యాపారవేత్త గండూరి ప్రకాష్ కూడా అదే చేశారు. చనిపోయిన తన కుమారుడు వర్ధంతి సందర్భంగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఉచిత పెట్రోల్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వందలాది మంది వాహానదారులు పెట్రోల్ బంకు దగ్గర క్యూ లైన్లో నిల్చున్నారు. మరణించిన తన కుమారుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఒక్కో వాహనానికి ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందజేశారు.

    చనిపోయిన కొడుకు జ్ఞాపకార్ధం..

    వ్యాపారవేత్త గండూరి ప్రకాష్ కుమారుడు ప్రీతం జోనా వర్ధంతి రోజున ఏదైన చేయాలనే ఉద్దేశంతో  వినూత్నంగా ఎదో చేయాలనే ఆలోచనతో ఇలా చేశారు. ఇప్పటికే చనిపోయిన కొడుకు పేరుతో ఫౌండేషన్ నిర్వహిస్తోన్నారు. ప్రీతమ్ జోనా వర్ధంతి రోజున ఉచితంగా పెట్రోల్ అందించారు ప్రకాష్. మధ్యాహ్నం వరకు దాదాపు 1.3 లక్షలతో 1200 మందికి పైగా ఉచిత పెట్రోల్ పంపిణీ చేశారు. సాయంత్రం వరకు దాదాపు 2 లక్ష‌ల రూపాయిల పెట్రోల‌ను స‌రాఫ‌రా చేశారు. అయితే ఉచిత పెట్రోల్ వార్త దావానలంలా వ్యాపించడంతో ప్రజలు భారీ క్యాన్లను కూడా తీసుకుని పెట్రోల్ బంక్ వద్దకు వచ్చినప్పటికి ప్రకాష్ పంపిణి విషయంలో కొన్ని నిబంధనలు పెట్టడంతో చాలా మంది వెనుదిరిగారు.

    రాజధాని టికెట్ తో గరుడా బస్సుల్లో ప్రయాణించే ఛాన్స్.. ప్రయాణికులకు TSRTC బంపరాఫర్..



    క్యూ కట్టిన వాహనదారులు..

    తన కుమారుడు వర్ధంతికి జ్ఞాపకార్ధం ఏదైనా చేయాలని భావించానని ఇప్పటికే ఆహారం, రోగులకు పండ్లు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. అందుకే కొత్తగా ఆలోచించి ఫ్రీ పెట్రోల్ అందించాలని అనుకున్నామని తెలిపారు. పెట్రోల్ ధర సామాన్యుల జేబులకు చిల్లులు పడేలా చేస్తోంది. కాబట్టి కొంతలో కొంత ఉపశమనం లభిస్తుందనే ఆలోచనతో రోజువారి కూలీలతో పాటు కొన్ని వర్గాల వారిక ఉచితంగా పెట్రోల్ అందించాలనే ఆలోచనతో ఈకార్యక్రమం నిర్వహించామన్నారు ప్రకాష్.

    Published by:Siva Nanduri
    First published:

    Tags: Suryapet, Telangana News

    ఉత్తమ కథలు