నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకలపాడులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) పర్యటనలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఓ ఫంక్షన్ కోసం ఇటుకలపాడుకు వెళ్లిన కోమటిరెడ్డి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఇటుకలపాడుకు రావడానికి గంటల సమయం పట్టింది. కోటి రూపాయలు పెడితే రోడ్డు వేయొచ్చు. ప్రగతిభవన్, సచివాలయాలు కట్టొచ్చు కానీ రోడ్డు వేయలేరా అని కోమటిరెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ కార్యకర్తల కోపం కట్టలు తెంచుకుంది. దీనితో కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) పై కుర్చేలు, కర్రలు, ఇతర వస్తువులు విసరబోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక అక్కడి నుంచి కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.
తుంగతుర్తి నియోజకవర్గంలోని ఇటుకలపాడులో జరిగిన ఓ కార్యక్రమానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వచ్చారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి కేసీఆర్ సర్కార్, బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. ఈ ఊరికి రావడానికి 3 గంటల సమయం పట్టింది. 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఇటుకలపాడుకు రావడానికి గంటల సమయం పట్టింది. కేసీఆర్ సర్కార్ కు ప్రగతిభవన్ కట్టడానికి 1000 కోట్లు, సచివాలయానికి 500 కోట్లు ఉంటాయి. కానీ కోటి రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి మాత్రం డబ్బులుండవని అన్నారు. రాష్ట్రాన్ని ఇప్పటికే అప్పుల కుంపటిగా మార్చారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలను అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్ గా తీసుకున్నారు. దీనితో అక్కడ ఉన్న కుర్చిలు, కర్రలతో దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.
దీనితో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితులను అదుపులోకి వచ్చాక కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు.
కాగా ఇటుకలపాడులో కోమటిరెడ్డిపై బీఆర్.ఎస్ కార్యకర్తల దాడి యత్నంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.