హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode Bypoll Result: కౌంటింగ్ పూర్తి కాకుండానే ఓటమిని అంగీకరించిన రాజగోపాల్‌రెడ్డి .. ఏమన్నారో వినండి

Munugode Bypoll Result: కౌంటింగ్ పూర్తి కాకుండానే ఓటమిని అంగీకరించిన రాజగోపాల్‌రెడ్డి .. ఏమన్నారో వినండి

(Photo:Face Book)

(Photo:Face Book)

Munugode Bypoll Result: మునుగోడు ఉపఎన్నికల ఫలితాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లుగా ప్రకటించారు బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. బీజేపీ అభ్యర్ధిగా పోటీలో నిలబడిన తనను ప్రచారం చేయనివ్వకుండా అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడిందన్నారు రాజగోపాల్‌రెడ్డి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

మునుగోడు( Munugodu)ఉపఎన్నికల ఫలితాల్లో ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్లుగా ప్రకటించారు బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy). మొదటి రౌండ్ మినహా మిగిలిన అన్నీ రౌండ్లు టీఆర్ఎస్‌(TRS)పార్టీ క్రమంగా మెజార్టీ పుంజుకుంటూ చివరకు ఏడు వేల ఓట్ల ఆధిక్యం దాటిపోవడంతో ఆయన ఓటమిని అంగీకరించారు. బీజేపీ అభ్యర్ధిగా పోటీలో నిలబడిన తనను అధికార పార్టీ తనను ప్రచారం చేయనివ్వకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు రాజగోపాల్‌రెడ్డి.  అధర్మంగా గెలిచినట్టేనని చెప్పారు. ఎందుకంటే దీనికి ఒకటే ఒక ఉదాహరణ భారత దేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో రిటర్నింగ్ అధికారి(Returning Officer)ని సస్పెండ్(Suspend)చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి జరిగిందన్నారు.

Munugode Bypoll Result: ఓటమిపై కేఏ పాల్ కొత్త భాష్యం.. ఆ కారణంతో ఎలక్షన్‌ రద్దు చేయాలని డిమాండ్

ఓటర్ల తీర్పును గౌరవిస్తా ..

మునుగోడు ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్‌తో పాటు పోలీసులు వ్యవస్థ, మొత్తం అధికార యంత్రాంగం అష్టదిగ్బంధం చేసి గ్రామానికి ఎమ్మెల్యే, గ్రామానికి మంత్రి భారత దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఈ అధర్మ యుద్ధంలో వాళ్ళు గెలిచే ప్రయత్నం చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డి మొత్తం అసెంబ్లీ కూడా మునుగోడుకు తీసుకొచ్చి అవినీతి సొమ్ముతో మద్యం పారించి ఎన్నికలో అధర్మం గెలిచిందన్నారు.

అధికార దుర్వినియోగంతోనే గెలుపు..

అయితే తన ఓటమిని అంగీకరించినట్లుగా ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి మునుగోడు తీర్పును ప్రజలందరూ గమనించాలన్నారు. పోలింగ్ రోజు కూడా డబ్బు మద్యం పంచారంటే అధికార దుర్వినియోగంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. అయితే ఈ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చామని పేర్కొన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ..ఇది టిఆర్ఎస్ గెలిచింది అనుకుంటుంది కానీ ఇది నెంబర్ గేమ్ మాత్రమేనన్నారు రాజగోపాల్‌రెడ్డి. తనను ఓడించడానికి వంద మంది ఎమ్మెల్యేలు మునుగోడు వచ్చి ఓటర్లను ప్రలోభాలతో ఒత్తిడి పెంచడం వల్ల ఈ దుర్మార్గ టీఆర్ఎస్‌ గెలిచిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Munugode Bypoll Result: మునుగోడు ఎన్నికలో నైతికంగా గెలిచింది బీజేపీనే .. ఈటల రాజేందర్‌ ఈక్వేషన్ కరెక్టేనా..!

మునుగోడులో నవంబరు 3న పోలింగ్ జరిగింది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు.  ఇందులో 2,25,192 మంది ఓటు వేశారు. వీరిలో 1,13,853 పురుషులు, 1,11,338, మంది స్త్రీలు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఆ స్థాయిలో మునుగోడు ఓటర్లు పోటెత్తారు.

చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లి‌లో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి.

పోలింగ్ ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 1, 2, 3, 4 రౌండ్లు, సంస్థాన్ నారాయణపురం  ఓట్ల కౌంటింగ్ 4, 5, 6 రౌండ్లలో చేస్తారు. ఇక మునుగోడు  ఓట్ల కౌంటింగ్ 6, 7, 8 రౌండ్లు, చండూరు మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 8, 9, 10 రౌండ్లు, గట్టుప్పల్ మండలం ఓట్ల కౌంటింగ్ 10, 11 రౌండ్లలో నిర్వహిస్తారు.  మర్రిగూడ మండలం ఓట్ల కౌంటింగ్ 11, 12, 13 రౌండ్లు, నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 13, 14, 15 రౌండ్లలో జరుగుతుంది.

మునుగోడులో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఐతే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యే నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి.

First published:

Tags: Komatireddy rajagopal reddy, Munugode Bypoll, Telangana News

ఉత్తమ కథలు