(Nagaraju A, Nalgonda)
Ambati venkanna: తెలంగాణ (Telangana) కోసం దశాబ్దకాలం పైగా శ్రమించిన ఉద్యమకారుడు. జానపద కళాకారుడు (Telangana Folk Artist) మన అంబటి వెంకన్న (Ambati Venkanna). పోరాడకుంటే మన బతుకులు మారవని దుఃఖాన్ని వలపోసిన వాగ్గేయకారుడు వెంకన్న. తెలంగాణతో పాటు ఇతర అనేక సామాజిక అంశాల మీద దశాబ్ద కాలానికి పైగా పాటలు రాశారు అంబటి వెంకన్న. ఆయన రచనల్లో ఎవరి అనుకరణలు కనిపించవు. ప్రపంచీకరణ, పలు వృత్తులు, తెలంగాణ ఉద్యమం (Telangana movement) ఇలా అనేక సామాజిక అంశాల మీద ఆయన రాసిన పాటలో వస్తు విసృతి, శిల్ప పరిణితి కనిపిస్తుంటుంది.
జానపద పాటల్లో తనదైన ముద్ర..
తన స్వంత ముద్రతో అద్భుతమైన ఎత్తుగడతో పాటకు అనుగుణంగా కవిత్వ మేళవింపుతో పాటలు రాయడం (Writing) వెంకన్న శైలిలోని గొప్పతనం. అంబటి వెంకన్న పూర్తిపేరు అంబటి వెంకట నరసింహ. స్వస్థలం నల్గొండ (Nalgonda) జిల్లా దోమలపల్లి గ్రామం. తల్లిదండ్రులు అంబటి గురువయ్య మన్నెమ్మ. విద్యార్హత విషయానికొస్తే ఎం.ఎ. ఇంగ్లీష్ బి. ఏడ్ తో పాటు ఎం.ఎ జానపద కళలు చదివారు. ఈ క్రమంలోనే సాహిత్యం పట్ల ఆకర్షితులైన ఆయన.. 1996లో దళిత కవి (Poet)గా ప్రస్థానం మొదలెట్టారు. క్రమంగా కథలు పాటలు రాయడం అలవర్చుకున్నారు.
టీచర్ ఉద్యోగాన్ని వదిలి ఉద్యమంలోకి..
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సమయంలో పాటలు రాయడమే (Songs writing) కాక.. ఇక 2002లో తను చేస్తున్న ఉపాధ్యాయ వృత్తి వదిలి ప్రత్యక్ష ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఇక పాట నేపథ్యం గురించి వెంకన్న మాటల్లో .. పాట శ్రమజీవుల్లో నుంచి రావడమే కాక అనేక సందర్భాల్లో పాట పల్లవిస్తుందని.. అందులో ఒక భాగమే జానపదులు. పురాణ గాథలు ఇతిహాసాలు, స్రీలు, పిల్లలు, సరసం, విషాదంతో కూడిన పాటలు దేనికదే వేరు వేరుగా ఉంటూపాట ఎప్పుడూ దాని అస్తిత్వాన్ని చాటుకుంటూ .. ఇప్పటిదాకా సమాజంలో దాని ప్రాధాన్యత,అవసరాన్ని పెంచుకుంటూ పోయింది.
వెంకన్న పాటల ప్రచురణ..
తెలంగాణతో పాటు ఇతర అనేక సామాజిక అంశాల మీద రెండు దశాబ్దాలుగా రాసిన పాటలన్నింటిని ‘’వెంకన్న పాటలు (Venkanna paatalu)’’ అనే బుక్ (Book)గా ప్రచురించారు. ఆయన రాసిన మొదటి సంకలనం.. తుంగతో పాటు మబ్బులు, జిల్లెడుపూలు, గోగులమల్లెలు సంకలనాలలోని పాటలను కలిపి అంబటి వెంకన్న పాటల సంకలనాన్ని ప్రచురించారు. ఇది ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. తెలంగాణ స్వాప్నికుడు, సిద్ధాంతకర్తప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో అసువులు బాసిన ఉద్యమకారులందరికి ఈ పుస్తకాన్ని అంకితం చేశారు.
ఐదు కేటగిరీల్లో పాటలు..
తెలంగాణ పాటలు (Telangana songs), జానపద గేయాలు, సామాజిక గీతాలు, కల్లు పాట, బతుకమ్మ పాటలను ఐదు భాగాలుగా క్యాసెట్లు , సీడీల రూపంలో తీసుకొచ్చారు వెంకన్న. జై బాలాజీ సినిమాలో మేం వచ్చే ఈ బాటన ఓ వెంకన్నపాటతో పాటు.. జంభూరాజ్జెం, సర్దార్ సర్వాయి పాపన్న, కల్లుపాట, సాపలు పచ్చాపలు వంటి వృత్తి కులాల పాటలు.. బీసీల పాటలు ప్రజలకు ఎంతోగానో చేరువయ్యాయి.
నటుడిగా అలరించిన అంబటి వెంకన్న..
ఆయన నటుడిగా.. కోహినూర్, పౌరుడు, హుష్కాకి, నైవేద్యం నాటికలు, జైబోలో తెలంగాణ చిత్రాల్లో నటించారు. ఆయన 2006లో భారతీయ దళిత సాహిత్య అకాడమీ ఢిల్లీ వారి చేత అంబేద్కర్ ఫెలోషిప్ అవార్డు అందుకున్నారు. బహుజనులు, బీసీల జీవితాన్ని పట్టుకొని పాటలోకి ఒంపిన వెంకన్నకు పాటకవుల్లో మొదటిస్థానం ఇవ్వవచ్చంటారు ప్రముఖ కవి గోరటి వెంకన్న. రాజకీయ, సామాజిక, సాంస్కృతిక కోణమే కాకుండా గొప్ప బతుకును.. పల్లె జీవితాన్ని ఒడిసి పట్టుకున్న వెంకన్న విశిష్ట శైలి మెచ్చకోగదగినది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nalgonda, Telangana folk artist