హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu Bypoll: మునుగోడు ఎవరిది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి డూ ఆర్ డై వార్

Munugodu Bypoll: మునుగోడు ఎవరిది? టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి డూ ఆర్ డై వార్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

munugodu bypoll: మునుగోడులో త్రిముఖ పోరు..టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి డూ ఆర్ డై వా బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలో దిగుతుండగా ...కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి పోటీలో నిలిచారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Nalgonda

  మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ఎఫెక్ట్ తో సమీకరణాలు మారిపోతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర రద్దయింది.  బైపోల్ షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రతో సహా పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. కాగా బీజేపీ మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి తెలంగాణలోనూ అధికారంలోకి రావాలనేది బీజేపీ వ్యూహం. కాగా ఇప్పటికే బీజేపీ తరపున ఉపఎన్నిక బరిలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో కాంగ్రెస్ లో ఉన్న రాజగోపాల్ ఇటీవల బీజేపీలో చేరారు. కానీ కార్యకర్తలు ఆయన వెంట నడుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

  ఇక ఇప్పటికే మునుగుడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రచారంలో పాల్గొంటారా అనేది సస్పెన్స్ గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ బ్రాండ్. కానీ ఇప్పుడు ఇద్దరు వేరు వేరు పార్టీలలో ఉండడంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.  కాగా మునుగోడు గెలుపుపై కాంగ్రెస్ గంపెడు ఆశలు పెట్టుకుంది.

  ఇక అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ గులాబీ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు సమాచారం. కానీ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. దసరా లోపే తమ అభ్యర్థిని ప్రకటించాలని గులాబీ బాస్ కేసీఆర్ యోచిస్తున్నారట. అయితే మాకు మునుగోడు ఏమి స్పెషల్ కాదు. అన్ని ఎన్నికల లానే ఇది కూడా అంటూ మంత్రి శ్రీనివాస్  గౌడ్ పేర్కొన్నారు. అలా అని మునుగోడు ఉపఎన్నికను తక్కువగా చేసి చూడమని ఖచ్చితంగా విజయం మాదే అని ధీమా వ్యక్తం చేశారు.

  ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే మునుగోడులో టఫ్ ఫైట్ వుండబోతున్నట్టు తెలుస్తుంది. మూడు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బలమైన వారు కావడం ఇందుకు కారణం. నల్గొండ కాంగ్రెస్ కు కంచుకోట. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ చేరికతో బీజేపీ కూడా విజయంపై ఆశావహంతో ఉన్నారు. మరోవైపు కేసీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకొని రేసులో ముందుకెళ్తారో చూడాలి మరి.

  ఉపఎన్నిక షెడ్యూల్ ఇలా..

  ఈనెల 7న మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబర్‌ 14వ తేది నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు కాగా నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వ అవకాశం ఇచ్చింది. ఇక ఉపఎన్నిక పోలింగ్‌ నవంబర్‌ 3న జరగనుండగా కౌంటింగ్ 6వ తేదిన నిర్వహించనున్నట్లుగా ఈసీ వెల్లడించింది.

  Published by:Rajasekhar Konda
  First published:

  ఉత్తమ కథలు