(Nagaraju, Nalgonda)
తెలుగు రాష్ట్రాల్లో శిశు విక్రయాలు (Child sales), బాల్యవివాహాలు (Child marriages) ఎక్కువగా ఉంటాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు, NGO సంస్థలు వాటికి అడ్డుకట్ట వేస్తున్నా. .వాటిని పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు. కానీ, ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి (Female government employee)…తన బాధ్యతలు నిర్వహిస్తూనే… సమాజంలో జరుగుతున్న ఈ శిశువిక్రయాలు ( Child Trafficking), బాల్య వివాహాలను అడ్డుకునేందుకు కృషి చేస్తున్నారు. ఆవిడే నాగమణి (Nagamani). కొంతమంది మహిళలు విధి నిర్వహణలో పురుషులకు ధీటుగా రాణిస్తుంటారు. జోడు గుర్రాలపై ప్రయాణం మాదిరి. .అటు గృహిణిగా (House wife).. ఇటు అధికారిగా రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ కోవకు చెందిన ఆమె.. సూర్యాపేట (Suryapet) జిల్లా చివ్వెంల మండలం చందుపట్లకు చెందిన నాగమణి కథ.
అంగన్వాడీ టీచర్ నుంచి గ్రేడ్-2 సూపర్వైజర్
కుటుంబం సభ్యుల ప్రోత్సాహంతో నాగమణి.. పదవ తరగతి పూర్తి చేసిన వెంటనే.. చందుపట్ల లో అంగన్వాడి టీచర్ (Anganwadi Teacher)గా ఉద్యోగంలో చేరారు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే డిగ్రీ పూర్తి చేశారు. 2013లో ఏపీపీఎస్సీ నిర్వహించిన ఐసీడీఎస్ సూపర్ వైజర్ (ICDS Supervisor) పరీక్షలకు హాజరై ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఆమె 2014లో నిజామాబాద్ జిల్లా గ్రేడ్-2 సూపర్ వైజర్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2018లో సూర్యాపేటకు బదిలీపై వచ్చి.. దామరచర్ల ప్రాజెక్టు పరిధిలోని కొండ్రపోల్‌లో విధులు (Duties) నిర్వర్తించారు. అంగన్వాడి కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ… చిన్నారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేశారు.
బాల్య వివాహాలు, శిశు విక్రయాలు నియంత్రణకు ఎనలేని కృషి!
నాగమణి ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి.. ప్రజలకూ అవగాహన కల్పిస్తూ శిశు విక్రయాలు, పిల్లల అక్రమ రవాణా (Child Trafficking's), బాల్యవివాహాలు (Child marriages) నియంత్రణకు ఎనలేని కృషి చేశారు. ఆమె కృషిని గుర్తింపుగా.. 2015 2016 2017లో ప్రభుత్వం నుంచి పురస్కారాలు (Awards) అందుకున్నారు.
ఆమె విధి నిర్వహణలో ఇప్పటివరకు .. 47 బాల్య వివాహాలు, 28 శిశు విక్రయాలు జరపకుండా కృషి చేశారు. పొక్సో చట్టం కింద నలుగురికి ప్రభుత్వ సాయం అందేలా కృషి చేశారు. అటు గృహిణిగా, ఇటు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న నాగమణి. శిశువిక్రయాలను నియంత్రించి..చిన్నారుల్లో (Childs) పోషకాహార లోపాన్ని నివారించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Child marriages, Children, Government jobs, Suryapet