Komatireddy Venkat Reddy | కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను తన అనుచరులు చంపేస్తారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ కు కోమటిరెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో కోమటిరెడ్డిపై చెరుకు సుధాకర్, కొడుకు సుహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐసీసీ 506 కింద పోలీసులు కోమటిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
చెరుకు సుధాకర్ ను తన మనుషులు చంపెస్తారని..అందుకోసం 100 కార్లలో తిరుగుతున్నారని..నీ ఆస్పత్రిని కూడా కూల్చేస్తారని చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ కు కోమటిరెడ్డి కాల్ చేసి బెదిరించారు. ఈ ఆడియో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనితో చెరుకు సుధాకర్, సుహాన్ పోలీసులను ఆశ్రయించారు. ఇక వివాదాస్పదంగా మారిన ఈ ఆడియోపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న (Komatireddy Venkat Reddy) వివరణ ఇచ్చారు. తాను బావోద్వేగంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని..అందులో వేరే ఉద్దేశ్యం లేదని అన్నారు. తనను సస్పెండ్ చేయాలని..దరిద్రుడని తిట్టారనే బాధతోనే అలా అన్నానని కోమటిరెడ్డి అన్నారు.
తన రాజకీయ జీవితంలో ప్రత్యర్థులను ఎప్పుడు తిట్టలేదని..శత్రువును కూడా దగ్గరకు తీసే తత్వం తనదని ఆయన అన్నారు. చెరుకు సుధాకర్ పార్టీలో చేరినప్పటి నుండి తనను తిడుతున్నాడని..ఈ విషయాన్ని ఆయన కొడుకు సుహాన్ కు ఫోన్ చేసి చెప్పానన్నారు. చెరుకు సుధాకర్ తనను దూషిస్తే నకిరేకల్ టికెట్ వస్తుందా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. గతంలో చెరుకు సుధాకర్ పై పీడీ యాక్ట్ పెడితే తానే పోరాటం చేశానని కోమటిరెడ్డి (Komatireddy Venkat Reddy) గుర్తు చేశారు.
అయితే వైరల్ అవుతున్న ఆడియోలో కొన్ని విషయాలు లీక్ చేశారని.తాను మాట్లాడిన అన్ని విషయాలు లేవని ఆయన అన్నారు. తనను టార్గెట్ చేసి పదే పదే తిడుతున్న చెరుకు సుధాకర్ పై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఫిర్యాదు చేశానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు.
ఈ ఘటనతో కోమటిరెడ్డిపై క్రమశిక్షణ కమిటీకి పలువురు నాయకులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.