Naini Narasimha Reddy: మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం మరింత విషమం ?

Naini Narasimha Reddy: మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం మరింత విషమం ?

నాయిని నరసింహారెడ్డి(ఫైల్ ఫొటో)

Naini Narasimha Reddy Health: కొద్దిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన మాజీమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టు తెలుస్తోంది.

  • Share this:
    తెలంగాణ మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 28న నాయిని నర్సింహారెడ్డికి కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఎప్పుడు యాక్టీవ్ గా, శారీరకంగా స్ట్రాంగ్ గా కనిపించే నాయిని త్వరలోనే కోలుకుంటారని అంతా భావించారు. అనుకున్నట్లుగానే ఆయనకు వారం క్రితం మరో సారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ కూడా వచ్చింది.

    త్వరలోనే ఆయన డిశ్చార్జ్ కూడా అవుతారని అంతా భావించారు. అయితే ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఆయన ఆరోగ్యం విషమించింది. ఊపిరి తీసుకోవడమే ఇబ్బందిగా మారింది. దీంతో వైద్యులు టెస్టులు చేయగా ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకి న్యుమోనియా వచ్చిందని గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం కోసం ఆయనను జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్వాన్స్‌డ్‌ క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

    ప్రస్తుతం నాయినిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాయిని నర్సింహారెడ్డిని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ సహా పలువురు ఇతర మంత్రులు పరామర్శించారు. అయితే ఇప్పటికీ నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు