Telangana: పోలియో బాధితుడైనా సేవలో మిన్న.. కరోనా బాధితులకు బాసటగా సేవలు..

అభివాదం చేస్తున్న నాగేశ్వరరావు

Khammam: చిన్ననాటి నుంచి సేవాభావంతో ఉన్న ఆయనకు 2016లో ఎస్ఆర్ఐ ఫౌండేషన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఆయనలోని సేవాతత్పరతకు తోడ్పాటైంది. ఆ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంస్థ సెక్రటరీ బండి నాగేశ్వరరావు ఎంతో మంది అభిమానాన్ని సంపాదించారు.

 • Share this:
  (జి. శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా న్యూస్18 తెలుగు)

  కల్లూరు మండల కేంద్రంలోని బండి రాఘవయ్య, సరస్వతిల కుమారుడు నాగేశ్వరావు. స్థానికంగా ఓ హోటల్ నిర్వహించేవారు. రెండేళ్ల ప్రాయంలో పోలియో బారిన పడ్డ అతడు.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, బీఎడ్, ఎంఎట్లు పూర్తి చేసిన అనంతరం 2002లో ఎస్జీటీ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగం సాధించాడు .
  చిన్ననాటి నుంచి సేవా గుణం ఉన్న తనకు పెళ్లయ్యాక భార్య రజిని ప్రోత్సాహం కూడా తోడైంది. వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో నాగేశ్వరరావు చేస్తున్నసేవా కార్యక్రమాలకు ఆమె కూడా వెన్నుదన్నుగా నిలుస్తోంది. గత సంవత్సరం లాక్ డౌన్ నేపథ్యంలో వేలాది మందికి రూ.50లక్షల విలువైన నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్ పంపిణీ చేశాం. ఈ ఏడాది కోవిడ్ కమ్యూనిటీకి వచ్చేసిన నేపథ్యంలో పంథా మార్చినట్లు తెలిపాడు. ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, మెడిసిన్, ఆక్సీజన్, మాస్కులు, శానిటైజర్, ఫుడ్ వంటివి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

  దీనిలో భాగంగా బుధవారం బోడేపూడి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి అండదండగా నిలుస్తున్నామని తెలిపారు. కోవిడ్ బాధితుల కోసం యూఎస్ నుంచి 20వేల ఎన్ 95 మాస్కులు, 20 (10లీటర్లు) ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్, 2000 పీపీఈ కిట్లు, పల్సీ ఆక్సీ మీటర్లు, బీపీ ఆపరేటర్లు, మెడికల్ కిట్లు తెప్పించి పంపిణీ చేస్తున్నట్లు తెలిపాడు. అమెరికా డాక్టర్ల బృందం ఇక్కడి డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతుంది. పేషెంట్లకు మనోస్థైర్యం కల్పిస్తుంది. ఇందుకు ఐసోలేషన్ కేంద్రంలో రెండు టీవీలు సైతం ఏర్పాటు చేయడి.. వాటిని మొబైల్తో అనుసంధానించి పేషెంట్లతో మాట్లాడిస్తున్నామన్నారు. తానా, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మరో వారం రోజుల్లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు. చేయబోతున్నామని తెలిపారు.
  గతంలో ఎన్నారై
  ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో వికలాంగులకు మూడు చక్రాల బండ్లు, 500 మందికి జైపూర్ లెగ్స్ పంపిణీ ..సుమారు 1500 పాఠశాలలకు టీవీలు సమకూర్చడం.. పరీక్షల సమయంలో గంపా నాగేశ్వరరావు వంటి మానసిక నిపుణులతో విద్యార్ధులకు మోటివేషన్ (ప్రేరణ) క్లాసెస్ నిర్వహించడం.. కౌమార దశలో ఉన్న విద్యార్థినులకు నాపికిన్స్ పంపిణీ చేయడం లాంటి వాటితో పాటు.. మాజీ మంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్య తో ఉన్న స్నేహంతో రూ.1.50 కోట్లు వెచ్చించి నాప్కిన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాతే ప్రభుత్వం ఈ కార్యక్ర మాన్ని చేపట్టింది.

  నాగేశ్వరరావు


  వైకల్యం గురించి..
  సంకల్పం గొప్పదైనప్పుడు వైకల్యం ఏమీ చేయలేదని ఆయన భావన. అదే ఆచరిస్తున్నారు. సర్వీస్ మోటోతో ముందుకెళ్తున్నారు.. వైకల్యం అనేది శరీరానికి సంబంధించిందే కానీ మనసుకు సంబంధించి కాదని నాగేశ్వరరావు బలంగా చెబుతారు. అన్నట్టు రక్తదాతగానూ ఆయనకు పేరుంది.
  Published by:Veera Babu
  First published: