• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • NAGARJUNASAGAR BY ELECTIONS ASSEMBLY ELECTION RESULTS 2021 LIVE UPDATES VOTE COUNTING LATEST NEWS COUNTING STARTED VRY

Nagarjunasagar by Election Results 2021 Live: నాగార్జున‌సాగర్‌లో 1400 పోస్టల్ ఓట్లు..వీటితో ట్రెండ్ తేలనుందా..?

Nagarjunasagar assembly by election results 2021 live ప్రతీకాత్మక చిత్రం

Nagarjunasagar Assembly by Election Results నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు 2021 Live: నాగర్జునాసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. అయితే ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు..పెద్ద మొత్తంలో పోస్టల్ ఉండడంతో ఫలితాల ట్రెండ్ తేలనుంది.

  • Share this:
    నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉంటుందా అనేది మరో రెండు గంటల్లో తేలనుంది. ముఖ్యంగా రాజకీయాల్లో తలపండిన నేతకు రాజకీయావారసత్వం పుచ్చుకున్న యువకుడికి మధ్య జరుగుతున్నఎన్నికలు అయితే రెండు పార్టీల , లేదా వ్యక్తుల అనేది మరి కొద్ది గంటల్లో తేలనున్న పోస్టల్ బ్యాలట్ ఓట్లలో తేలనుంది..

    నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి..అయితే సాగర్‌ అటు కాంగ్రెస్ ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్ మధ్య పోటి ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఫలితం వచ్చేందుకు చివరి రౌండ్ వరకు వేచి ఉండాల్సి వస్తుందని, మరోసారి దుబ్బాకలో టీఆర్ఎస్ ఎదుర్కోన్న ఉత్కంఠ ఉంటుందని అంతా భావిస్తున్నారు..

    5 States Elections Results: నేడే ఫలితాలు..   ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    పూర్తిస్థాయి ఫలితం వచ్చేందుకు సాయంత్రం అవుతుండగా ఎన్నికల ట్రెండ్ ఎలా ఉండబోతుందన్నది పోస్టల్ ఎన్నికల ద్వార స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే మొత్తం 1400 పోస్టల్ ఓట్లు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు , ఉద్యోగులకు ఈ పోస్టల్ అవకాశం ఇచ్చే సంప్రాదాయం ఉండగా ఈసారి కరోనా నేపథ్యంలో వృద్దులతో పాటు కోవిడ్ బాధితులకు కూడ పోస్టల్ ఓటు హక్కును కల్పించడంతో ఈ స్థాయిలో ఓట్లు నమోదు అయ్యాయి. కాగా ఈ ఎక్కువ శాతం పోస్టల్ ఓట్లు నమోదు కావడంతో వాటి ఫలితాల అనంతరం కొత్త స్పష్టత వచ్చే అవకాశం కన్పిస్తోంది. దీంతో ట్రెండ్ ఎలా ఉందనేది పోలింగ్ 9 గంటలవరకు తేలే అవకాశాలు కనిపస్తున్నాయి. వీటి అనంతరమే ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు..కాగా మధ్యహ్నాం వరకు పూర్తి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
    Published by:yveerash yveerash
    First published: