NAGARJUNASAGAR BY ELECTION 30 PERCENTAGE POLLING AT 11 AM VS
Nagarjunasagar by election :సాగర్‌లో 30 శాతం పోలింగ్.. కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్
file photo
నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం పదకొండు గంటల వరకు ముప్పై శాతం పోలింగ్ అయినట్టు అధికారులు వెల్లడించారు. కాగా 2018 సాధరణ ఎన్నికల్లో మొత్తం 86 శాతం పోలింగ్ అయింది.
నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం పదకొండు గంటల వరకు ముప్పై శాతం పోలింగ్ అయినట్టు అధికారులు వెల్లడించారు. కాగా 2018 సాధరణ ఎన్నికల్లో మొత్తం 86 శాతం పోలింగ్ అయింది. అయితే కరోనా నేపథ్యంలో రెండు గంటలపాటు అదనంగా సమయం కేటాయించింది ఈసీ, కాగా ఉదయం రెండు మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ఓటింగ్ నమోదయింది..
ఇది మినహా ఎక్కడ ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కొనసాగుతోంది. ఎండకాలం కావడంతో ఓటర్లు ఉదయమే బారులు తీరారు. దీంతో ఓక్కో ఓటరుకు ఓటు వేసేందుకు కనీసం గంట సమయం పడుతున్నట్టు ఓటర్లు చెబుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. కాగా కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఉప ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు బరిలో నిలివగా , మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కాగా మొత్తం నియోజకవర్గంలో నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలు ఉన్నారు. ఇక కరోనా నేపథ్యంలో ఎలాంటీ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. శానిటైజర్లతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలు పక్కగా అమలు పరుస్తున్నారు. మాస్క్ వేసుకుని వస్తున్న వారినే క్యూలోకి అనుమతి ఇస్తున్నారు.