• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • NAGARJUNASAGAR ASSEMBLY BY ELECTION RESULTS 2021 LIVE UPDATES VOTE COUNTINGLATEST NEWS VIDHAN SABHA NAGARJUNASAGAR BY ELECTIONS VRY

Nagarjunasagar by Election Results 2021 Live Updates నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు నేడే..ఉదయం 9 గంటలకు తొలి ఫలితం

Nagarjunasagar by Election Results 2021 Live: నేడు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు 9 గంటలకు తొలిరౌండ్ ఫలితం

Assembly Election Results నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు 2021 Live: దేశంలోని ఐదు రాష్ట్రాల సాధరణ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగిన నాగర్జునాసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుండగా పోస్టల్ ఓట్లను ముందుగా లెక్కించనున్నారు.

  • Share this:
    దేశంలోని ఐదు రాష్ట్రాల సాధరణ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగిన నాగర్జునాసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుండగా పోస్టల్ ఓట్లను ముందుగా లెక్కించనున్నారు. కాగా 25 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మొదటి రౌండ్ ఫలితాలు ఉదయం తొమ్మిది గంటలకు వెలువడే అవకాశం ఉండగా చివరి ఫలితం తేలే వరకు సాయంత్రం నాలుగు గంటలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక మండలాల వారిగా ముందుగా గుర్రంపోడు మండలం చివరగా త్రిపురాంతో లెక్కింపు ముగియనుంది.

    తెలంగాణలో నోముల నోముల నర్సయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైన
    విషయం తెలిసిందే... వీటీని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
    ఏప్రిల్ 17 న పోలింగ్ జరగ్గా మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే టీఆర్‌ఎస్‌ నుంచి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి, బీజేపీ రవి నాయక్‌ మధ్య ప్రధాన పోటీ నడిచింది. మొత్తం ఓట్లు 220206 ఉండగా పోలైన ఓట్లు 189782   ఉండగా  86.1 శాతం ఓట్లు పోలయ్యాయి

    5 States Elections Results: నేడే ఫలితాలు.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ

    ఇక అయితే గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ‘ఆరా’ సర్వే వెల్లడించింది.   పోలైన ఓట్లలో ఎవరికీ ఎంత శాతం ఓట్లు రావచ్చో అంచనా వేసి చెప్పింది. ఆరా పోస్ట్ పోల్ సర్వేలో అధికార టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రెండో స్థానంలో కాంగ్రెస్ కు 39.93 శాతం, మూడో స్థానంలో బీజేపీ కి 6.31 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఓట్ల శాతం ఆధారంగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని టీఆర్ఎస్ సర్వే ప్రకారం అలాగే నిలబెట్టుకుంటుందా.. లేదా అనేది నేడు జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది.
    Published by:yveerash yveerash
    First published: