నిండుకుండలా నాగార్జున సాగర్.. రిజర్వాయర్‌లో 311.33 టీఎంసీల నీళ్లు..

నాగార్జునసాగర్ డ్యామ్

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నిండుకుండలా మారింది. అలల తాకిడితో ప్రాజెక్టు గేట్ల పైనుంచి కృష్ణమ్మ కిందికి జలపాతంలా జాలువారుతోంది.

  • Share this:
    ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలతో ప్రాజెక్టులన్నీ జల కళను సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నిండుకుండలా మారింది. అలల తాకిడితో ప్రాజెక్టు గేట్ల పైనుంచి కృష్ణమ్మ కిందికి జలపాతంలా జాలువారుతోంది. సాగర్ ప్రాజెక్టు 2 క్రస్ట్ గేట్లను ఎత్తి 81000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు తిరిగి వాటిని మూసేశారు. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో వల్ల క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇక, ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగాను శనివారం సాయంత్రం నాటికి 589.80 అడుగులుగా ఉంది. రిజర్వాయర్‌లో 311.4474 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

    నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన జల విద్యుత్తు కేంద్రం ద్వారా 33130 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9189 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8896 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డీటీ గేట్స్ (డైవర్షన్ టన్నెల్) ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుంచి మొత్తం 53925 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: