నాగార్జున సాగర్‌కు 65 ఏళ్లు... మీకు తెలియని ఆసక్తికర విశేషాలు

Nagarjuna Sagar : కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. తెలంగాణలో నల్గొండ జిల్లా నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు.

news18-telugu
Updated: December 10, 2019, 1:05 PM IST
నాగార్జున సాగర్‌కు 65 ఏళ్లు... మీకు తెలియని ఆసక్తికర విశేషాలు
నాగార్జున సాగర్‌కు 65 ఏళ్లు పూర్తి... మీకు తెలియని ఆసక్తికర విశేషాలు
  • Share this:
Nagarjuna Sagar : వరల్డ్ ఫేమస్ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగి నేటి (డిసెంబర్‌ 10)తో 64 ఏళ్లు పూర్తయ్యాయి. ఆంధ్ర రాష్ట్ర అన్నపూర్ణగా, రైతుల కల్పతరువుగా మారిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1955 డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేశారు. ప్రముఖ ఇంజనీర్‌ కేఎల్‌ రావు, ముత్యాల జమీందార్‌ మహేశ్వరప్రసాద్‌ ఆలోచనలు దీనికి అంకురార్పణ చేశాయి. ప్రాజెక్టు నిర్మాణానికి వేల మంది శ్రమజీవులు చెమట చిందించగా... వందల మంది ప్రాణాలు కోల్పోవడం మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. 1970లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. డ్యాం నిర్మాణ దశలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు మొట్టమొదటి చీఫ్‌ ఇంజనీరుగా పనిచేసిన మీర్‌జాఫర్‌ అలీ నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే. ప్రపంచ రాతి నిర్మాణాల ప్రాజెక్టుల్లో నాగార్జునసాగర్‌ డ్యాం పొడవు, ఎత్తుల్లో ప్రథమస్థానంలో ఉండడం విశేషం. నాగార్జునసాగర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇది 285 చ.కి.మీ. విస్తీర్ణంతో 408 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని కలిగివుంది. 44 ఏళ్లుగా కృష్ణా నదిలో వచ్చిన వరదల వల్ల రిజర్వాయర్‌లో పూడిక చేరడంతో సాగర్‌లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 312 టీంఎసీలుగా ప్రభుత్వం నిర్ధారించింది. సుమారు 96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని రిజర్వాయర్‌ కోల్పోయినట్లైంది.

nagarjuna sagar,nagarjuna sagar dam,nagarjuna sagar images,nagarjuna sagar inflow,nagarjuna sagar outflow,nagarjuna sagar dam videos,nagarjuna sagar waterfalls,nagarjuna sagar flood water,nagarjuna sagar water level,huge inflow to nagarjuna sagar,heavy water in nagarjuna sagar,releases water from nagarjuna sagar,nagarjuna,sagar,telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్,
నాగార్జున సాగర్‌కు 65 ఏళ్లు పూర్తి...


జవహర్‌ కెనాల్‌ : నాగార్జునా సాగర్ కుడికాలువకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1956 అక్టోబర్‌ 10న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఈ కాలువకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న నీటిని విడుదలచేసి జాతికి అంకితమిచ్చారు. దీనిని జవహర్‌ కెనాల్‌ అని పిలుస్తున్నారు. ఈ కాలువ గుంటూరు, ప్రకాశం జిల్లాలో సుమారు 203కి.మీ. ప్రవహిస్తూ రైతుల ఆశాజ్యోతిగా వెలుగొందుతోంది. ఈ కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు నీరందుతోంది. ఈ కాలువ కింద ఆయకట్టును 22 బ్లాకులుగా విభజించారు. వీటికి 9 బ్రాంచ్‌ కెనాల్స్‌ కలిగి 5342 కి.మీ. పంటలకు నీటిని అందిస్తోంది. దీనికితోడు ఫీల్డ్‌చానల్స్‌ ద్వారా 14,400 కి.మీ. పంటలకు నీరు అందుతోంది.

నాగార్జున సాగర్‌కు 65 ఏళ్లు పూర్తి...


లాల్‌బహుదూర్‌ కెనాల్‌ : జై జవాన్‌.. జై కిసాన్‌ అని నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌బహుదూర్‌ శాస్త్రి జ్ఞాపకార్థం సాగర్‌ ఎడమ కాలువకు లాల్ బహుదూర్‌ కెనాల్‌ అని పేరు పెట్టారు. ఈ కాలువకు 1959లో అప్పటి రాష్ట్ర గవర్నర్‌ భీమ్‌సేన్‌ సచార్‌ శంకుస్థాపన చేయగా... కుడి కాలువతోపాటే ఇందిరాగాంధీ 1967 ఆగస్టు 4న ప్రారంభోత్సవం చేశారు. ఈ కాలువ ద్వారా 10.38 లక్షల ఎకరాలకు నీరు అందుతోంది. మొత్తం 297కి.మీ. పరిధిలోని పొలాలకు సాగునీరు అందుతోంది. దీనికున్న 7బ్రాంచ్‌ కాలువల ద్వారా 7722 కి.మీ., ఫీల్డ్‌ చానల్స్‌ ద్వారా 9654 కి.మీ. పంట పొలాలను సస్యశ్యామలం చేస్తుున్నారు. వీటికితోడు 26 క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలయ్యే నీటితో కృష్ణాడెల్టా ప్రాంత రైతులకు పంటలు పండించేందుకు ఉపయోగకరంగా ఉంది.

నాగార్జున సాగర్‌కు 65 ఏళ్లు పూర్తి...


జలవిద్యుత్ కేంద్రాలు : నాగార్జునసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా సేద్యపు నీటినే కాకుండా జలవిద్యుద్ ఉత్పత్తి చేసే కేంద్రంగా కూడా ప్రాధాన్యం పొందింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుపై 410 మెగావాట్ల ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, కుడి కాలువపై 90 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం, ఎడమ కాలువపై 60 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రాల్ని నిర్మించారు. వీటికితోడు కుడికాలువపై హైడల్‌ పవర్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ రాష్ట్రంలో సాగు, తాగునీటితోపాటు విద్యుత్‌ కొరతను కూడా తీరుస్తున్నారు. అందుకే దీనిని బహుళార్థ సాధక ప్రాజెక్టు అని అంటున్నారు.
నాగార్జున సాగర్‌కు 65 ఏళ్లు పూర్తి...


ప్రపంచ పర్యాటక కేంద్రం : నాగార్జునసాగర్‌ ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా నిలిచింది. కృష్ణానది లోయలో మహాయాన బౌద్ధమత విస్తరణకు ఆచార్య నాగార్జునుడు నెలకొల్పిన యూనివర్సిటీ ప్రపంచంలో బౌద్ధ మత వ్యాప్తికి ఎంతో దోహదం చేసింది. క్రీస్తు శకం రెండో శతాబ్దంలోని శాతవాహన కాలంనాటి జీవనశైలి, మూడో శతాబ్దం నాటి ఇక్ష్వాకుల రాజధానిగా విజయపురి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఏకైక ఐలాండ్‌ మ్యూజియంగా ఉన్న నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాల్ని,... కుడి, ఎడమ కాలువలను, మోడల్‌ డ్యాంను చూసేందుకు రోజూ వందల మంది దేశ-విదేశీ పర్యాటకులు నాగార్జునసాగర్‌‌కు రావడంతో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.


టాలీవుడ్ వైపు చూస్తున్న టాక్సీవాలా నటి మాళవికా నాయర్



ఇవి కూడా చదవండి :

ట్రెండ్ మార్చిన రష్మీ గౌతమ్... ఇక ఫ్యాన్స్‌కి పండగే...

శ్రీలంక తమిళుల సంగతి చూడండి... కేంద్రానికి రవిశంకర్ విజ్ఞప్తి

లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ కొడుకుపై బాంబు దాడి... తృటిలో తప్పించుకున్న తల్హా సయీద్

తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడిపై NIA కేసు నమోదు... ఎందుకంటే...

విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు... ఆ తర్వాత...
Published by: Krishna Kumar N
First published: December 10, 2019, 1:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading