హోమ్ /వార్తలు /telangana /

Nagarjuna Sagar Bypoll: చిరుతపులితో నోముల భగత్ వాకింగ్?... వర్మ వైరల్ ట్వీట్

Nagarjuna Sagar Bypoll: చిరుతపులితో నోముల భగత్ వాకింగ్?... వర్మ వైరల్ ట్వీట్

Nagarjuna Sagar Bypoll: ఆల్రెడీ హీట్‌ మీద ఉన్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్ని రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్‌తో మరింత వేడెక్కించాడు. ఇప్పుడా ట్వీట్ రచ్చ రేపుతోంది. ఆ చిరుతపులి కథేంటో తెలుసుకుందాం.

  Nagarjuna Sagar Bypoll: రాజకీయాల్ని పట్టి కుదిపేయడంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టైలే వేరు. ఒక్క ట్వీట్ చేస్తే చాలు అది కాస్తా దుమారం రేపుతుంది. ఇప్పటికే ఎన్నో ఎన్నికల్లో సంచలన ట్వీట్లు చేసిన వర్మ... తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై స్పందించారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహారావు కొడుకు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (TRS) అభ్యర్థి నోముల భగత్... ఓ చిరుత పులితో వాకింగ్ చేస్తూ వెళ్తున్న చిన్న వీడియోను వర్మ (RGV) ట్వీట్ చేశారు. అంతే... ఇక దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ట్వీట్‌ వీడియోని ఇప్పటికే 50వేల మంది దాకా చూడగా... 2400 మందికి పైగా లైక్ చేశారు. ఇక కామెంట్ల తుఫాను వస్తూనే ఉంది.

  "వామ్మో... కేసీఆర్, కేటీఆర్‌లు టైగర్‌, సింహాలు అని మనకు తెలుసు. కానీ, అభ్యర్థి నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్‌ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాణ్ని’’ అని వర్మ ట్వీట్ చేశారు.

  రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్‌ కూడా చేసారు. ‘‘ఈ అభ్యర్థి నోముల భగత్... "మాకు ఓటు వేయండి. నాగార్జునసాగర్‌లో మన గర్జనకు ఏ ఒక్క పార్టీ నిలబడలేదు" అంటున్నారు. చిరుత పులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’’ అని మరో ట్వీట్ చేశారు.

  చిరుతపులితో నోముల భగత్ నిజంగానే వెళ్లారా... వెళ్తే... ఎక్కడ వెళ్లారు... ఎప్పుడు వెళ్లారనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. వీడియోని గమనించిన చాలా మంది నెటిజన్లు అది గ్రాఫిక్ కాదనీ... నిజమైన వీడియోనే అని అంటున్నారు. చిరుతపులి, నోముల భగత్ నీడలను బట్టీ... నిజంగానే చిరుతపులి (walking with leopard)తో వాకింగ్ చేశారని అంటున్నారు. ఇది నిజమే అయితే... ఇండియాలో ఇలా చెయ్యడానికి అనుమతి ఇవ్వరు. చుట్టూ ఉన్న గడ్డిని బట్టీ... అది ఆఫ్రికా సహారా ఎడారి లాంటిది కావచ్చని కొందరు అంటున్నారు. అక్కడి సఫారీల్లో ఇలా చిరుతలతో ప్రజలు దగ్గరగా ఉండేలా వాటికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు కాబట్టే... ఇది అక్కడిదే అంటున్నారు కొందరు.

  ప్రస్తుతం ఈ ట్వీట్‌పై పెద్ద సంచలనే రేగుతోంది. ఈ ట్వీట్‌కి అనుకూలంగా, వ్యతిరేకంగా చాలా మంది రిప్లైలు ఇస్తున్నారు.

  మొత్తానికి టైమ్ దగ్గర పడుతుంటే... నాగార్జున సాగర్ బైపోల్ వేసవి వేడిని మించి హీట్ పుట్టిస్తోంది. మరి ఓటర్లు ఏ తీర్పు ఇస్తారో.

  First published:

  ఉత్తమ కథలు