Home /News /telangana /

NAGARJUNA SAGAR BY ELECTIONS BJP FOCUS IN BC LEADER KADARI ANJAIAH YADAV SK

Nagarjuna Sagar: బీజేపీ నుంచి మరో కొత్త అస్త్రం.. సాగర్ టికెట్ ఆయనకేనా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nagarjunasagar by elections: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజిక నేతగా కడారి అంజయ్యయాదవ్‌కు గుర్తింపు ఉంది. అందులోనూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం మరింత కలిసొచ్చే అంశం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 27,852 ఓట్లను సాధించారు అంజయ్య.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నేయమని చెబుతున్న కాషాయ దళం.. అందుకు తగ్గట్లే క్షేత్రస్థాయిలో బలపడుతోంది. రోజురోజుకూ ఎదుగుతూ ప్రత్యర్థులను దెబ్బతీస్తోంది. దుబ్బాకలో సంచలన విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎవరూ ఊహించని సీట్లను సాధించింది కాషాయదళం. బీజేపీ గెలిచిన స్థానాలను చూసి టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ కూడా షాక్ అయింది. ఇక ఇదే ఊపుతో తెలంగాణలో సత్తాచాటాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. రానున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లోనూ విజయం సాధించాలని పక్కాగా వ్యూహాలను రచిస్తోంది. ముఖ్యంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టిసారించింది.

    నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమయ్యింది. దుబ్బాకలో గెలిచినట్లుగానే ఇక్కడా విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. మొన్నటి వరకు జానారెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్తోందని ప్రచారం జరిగింది. ఆయన కుమారుడు రఘవీర్ రెడ్డికి బీజేపీ టికెట్ ఇస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ వార్తలను జానారెడ్డి కుటుంబం ఖండించింది.

    బీజేపీలో చేరేది లేదని జానారెడ్డి కుమారుడు స్పష్టం చేయడంతో.. మరో బలమైన నేతపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. నాగార్జునసాగర్‌లో బీసీ నేతగా పేరున్న కడారి అంజయ్యయాదవ్ వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కడారి అంజయ్య 2019 ఆగస్టులో బీజేపీలో చేరారు. అప్పటి నుంచీ నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కడారి అంజయ్యతో పాటు నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదితారెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిస్తోంది. ఐతే వీరిద్దరిలో కడారి అంజయ్యకే బీజేపీ హైకమాండ్ జైకొడుతున్నట్లు సమాచారం అందుతోంది.

    నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజిక నేతగా కడారి అంజయ్యయాదవ్‌కు గుర్తింపు ఉంది. అందులోనూ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం మరింత కలిసొచ్చే అంశం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి 27,852 ఓట్లను సాధించారు అంజయ్య. గత ఎన్నికల్లో సాగర్‌లో బీజేపీ తరపున పోటీ చేసిన నివేదితా రెడ్డి కేవలం 3వేల లోపు ఓట్లన సాధించగలిగారు. ఇది ఆమెకు మైనస్‌గా మారింది. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దలు కడారి అంజయ్యనే సాగర్ బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం.


    2018 ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి ఒకే ఒక్కరు విజయం సాధించారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ మాత్రమే గెలిచారు. కానీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సత్తాచాటింది. టీఆర్ఎస్‌కు షాకిస్తూ తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లను సాధిచింది. ఇక ఈ ఏడాది జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాలు సాధించి సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరింది. అదే ఊపుతో ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నిల్లోనూ గెలవాలని పక్కా ప్లాన్ సిద్ధం చేస్తోంది కాషాయదళం.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bjp, Nagarjuna Sagar By-election, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు