హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarjuna Sagar By Election Date: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..

Nagarjuna Sagar By Election Date: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..

Nagarjuna Sagar By Election Date: తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Nagarjuna Sagar By Election Date: తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Nagarjuna Sagar By Election Date: తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది.

  తెలంగాణలో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 17 ఏపీలో తిరుపతి లోక్ సభ స్థానంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 23న ఎన్నికల సంఘం నోటిపికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండా.. తమిళనాడు, అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరితో పాటు మే 2న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి.

  నాగార్జున ఉప ఎన్నికకు సంబంధించి ముఖ్యమైన తేదీలు

  మార్చి 23న నోటిఫికేషన్ విడుదల

  మార్చి 30 వరకు నామినేషన్ల స్వీకరణ

  మార్చి 31న నామినేషన్ల పరిశీలన

  ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు

  ఏప్రిల్ 17న పోలింగ్

  మే 2న ఓట్ల లెక్కింపు

  నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే అప్పటికే తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమలులో ఉండటంతో.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించలేదు. రెండు రోజుల క్రితం ఈ ఎన్నికలు అయిపోవడంతో తాజాగా నాగార్జునసాగర్‌తో పాటు ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.

  అన్ని పార్టీలకు నాగార్జునసాగర్ టెన్షన్

  టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇది టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. దుబ్బాకలో బీజేపీ అనూహ్య విజయం సాధించడంతో.. నాగార్జునసాగర్‌లో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజేపీ.. అదే ఊపును నాగార్జునసాగర్‌లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఆ పార్టీ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది.

  ఇక నాగార్జునసాగర్ సీటు కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందుకు అసలు కారణం ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి గతంలో అనేకసార్లు గెలవడమే. ఇప్పుడు కూడా ఆయనే బరిలో ఉండటంతో ఈ సీటును కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

  First published:

  Tags: Nagarjuna Sagar By-election, Telangana

  ఉత్తమ కథలు