• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • NAGARAJUNASAGAR ELECTION RESULT 2021 SAGAR BY ELECTIONS LIVE UPDATES VOTE COUNTING TELANAGANA TRS T CONGRESS JANAREDDY TRS LEADING IN FIRST ROUND VRY

Nagarjunasagar by Election Results 2021 Live: నాగార్జున‌సాగర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యత

Nagarjunasagar assembly by election results 2021 live updates నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ ఆధిక్యత

Nagarjunasagar by Election Results 2021 Live: నాగార్జున‌సాగర్‌లో మొదటిరౌండ్‌లో టీఆర్ఎస్ అధిక్యత నాగార్జున సాగర్‌లో మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తోంది. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కాంగ్రెస్ అభ్యర్థి కంటే జానారెడ్డి కంటే 1445 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు.

  • Share this:
    నాగార్జున సాగర్‌లో మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచింది. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కాంగ్రెస్ అభ్యర్థి కంటే జానారెడ్డి కంటే 1445 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు..కాగా మొదటి రౌండ్ లో 4228 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ పార్టీకి 2753 ఓట్లు పోలయ్యాయి..ఇక పోస్టల్ ఓట్లతో పాటు ఈవీఎం ఓట్ల కూడ ఒకేసారి కొనసాగుతోంది. కాగా రెండవ రౌండ్‌లో మొత్తం 2216 ఓట్లతో అధిక్యత కనబరచగా మూడవ రౌండ్‌ సైతం టీఆర్ఎస్ 3421 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతోంది.

    దేశంలోని ఐదు రాష్ట్రాల సాధరణ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగిన నాగర్జునాసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడతున్నాయి.. ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యాయి. పోస్టల్ ఓట్లను ముందుగా లెక్కించనున్నారు. కాగా 25 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మొదటి రౌండ్ ఫలితాలు ఉదయం తొమ్మిది గంటలకు వెలువడే అవకాశం ఉండగా చివరి ఫలితం తేలే వరకు మధ్యహ్నం ఓంటిగంట  అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక మండలాల వారిగా ముందుగా గుర్రంపోడు మండలం చివరగా త్రిపురాంతో లెక్కింపు ముగియనుంది.

    తెలంగాణలో నోముల నోముల నర్సయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైన
    విషయం తెలిసిందే... వీటీని టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అంత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
    ఏప్రిల్ 17 న పోలింగ్ జరగ్గా మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే టీఆర్‌ఎస్‌ నుంచి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి, బీజేపీ రవి నాయక్‌ మధ్య ప్రధాన పోటీ నడిచింది. మొత్తం ఓట్లు 220206 ఉండగా పోలైన ఓట్లు 189782 ఉండగా 86.1 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రతి రౌండ్‌కు 7500 చొప్పున మొత్తం 14 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు.

    5 States Elections Results: ..ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    ఇక అయితే గురువారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ‘ఆరా’ సర్వే వెల్లడించింది. పోలైన ఓట్లలో ఎవరికీ ఎంత శాతం ఓట్లు రావచ్చో అంచనా వేసి చెప్పింది. ఆరా పోస్ట్ పోల్ సర్వేలో అధికార టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రెండో స్థానంలో కాంగ్రెస్ కు 39.93 శాతం, మూడో స్థానంలో బీజేపీ కి 6.31 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్  అభ్యర్థి జానారెడ్డి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఓట్ల శాతం ఆధారంగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని టీఆర్ఎస్ సర్వే ప్రకారం అలాగే నిలబెట్టుకుంటుందా.. లేదా అనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.
    Published by:yveerash yveerash
    First published: