హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జడ్పీ చైర్‌పర్సన్‌కు చుక్కెదురు, జడ్పీటీసీ ఎన్నిక చెల్లదన్న ట్రిబ్యునల్ కోర్ట్

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జడ్పీ చైర్‌పర్సన్‌కు చుక్కెదురు, జడ్పీటీసీ ఎన్నిక చెల్లదన్న ట్రిబ్యునల్ కోర్ట్

జడ్పీటీసీ ఎన్నిక చెల్లదన్న ట్రిబ్యునల్ కోర్ట్,

జడ్పీటీసీ ఎన్నిక చెల్లదన్న ట్రిబ్యునల్ కోర్ట్,

పద్మావతికి ముగ్గురు పిల్లలు ఉన్నారని నిర్దారణ చేసి జడ్జి డీబీ శీతల్ ఈ తీర్పునిచ్చారు. 2019 మే 14న తెలంగాణలో జడ్పీటీసీ ఎన్నికలు జరుగగా మే 27న ఫలితాలు వెలువడ్డాయి.

(N.Naveen Kumar,News18, Nagarkurnool)

నాగర్‌కర్నూల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలకపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న జడ్పీటీసీ పెద్దపల్లి పద్మావతి,ఎన్నిక చెల్లదని ఎన్నికల ట్రిబ్యునల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పద్మావతికి ముగ్గురు పిల్లలు ఉన్నారని నిర్దారణ చేసి జడ్జి డీబీ శీతల్ ఈ తీర్పునిచ్చారు. 2019 మే 14 న తెలంగాణలో జడ్పీటీసీ ఎన్నికలు జరుగగా మే 27న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన పెద్దపల్లి పద్మావతి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. సుమిత్రా పై గెలుపొందారు. అయితే పద్మావతికి ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జెడ్పీటీసీ గా పోటీ చేసి గెలుపొందారని ప్రత్యర్థి ఎన్. సుమిత్ర కోర్టును ఆశ్రయించారు. దీంతో సుదీర్ఘ విచారణ చేపట్టిన అనంతరం కోర్టు.. పద్మావతి ఎన్నికపై తీర్పును వెలువరించారు. పద్మావతికి ముగ్గురు పిల్లలు ఉన్నారని నిర్దారణ కావడంతో జడ్పీటీసీగా ఆమె ఎన్నిక చెల్లదని ఎలక్షన్ ట్రిబ్యునల్ కోర్ట్ తీర్పును వెల్లడించారు.

కాగా, ఈ అంశం ఇప్పుడు నాగర్‌కర్నూల్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. జడ్పీ చైర్‌పర్సన్‌‌ పై జడ్పీటీసీ పదవిపై అనర్హత వేటు పడడంతో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి అంశాలపై ఆసక్తి నెలకొంది. నాగర్‌కర్నూల్ జడ్పీ చైర్మన్ పదవి ఎస్సి జనరల్‌కు రిజర్వు కావడంతో ఎన్నిక సమయంలోనే కొంత ఆసక్తి నెలకొన్నది. జిల్లాలో టీఆర్ఎస్ తరుపున గెలుపొందిన ఎస్సి జడ్పీటీసీలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అప్పట్లో ఎక్కువగా ఎంపీ రాములు కుమారుడు, జడ్పీటీసీ భారత్ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే అనూహ్యంగా తెలకపల్లి జడ్పీటీసీ పెద్దపల్లి పద్మావతి పేరు తెరపైకి వచ్చింది. జిల్లా ఎమ్మెల్యేల నిర్ణయాలతో ఎవరు ఊహించని విధంగా పెద్దపల్లి పద్మావతిని జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కూడా పద్మావతికి ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆమెపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి ఎన్. సుమిత్ర కోర్టును ఆశ్రయించారు.

2019 జూన్ నెల నుంచి ఈ కేసు పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు మూడేళ్ళ అనంతరం పెద్దపల్లి పద్మావతికి ముగ్గురు పిల్లలు ఉన్నారని కోర్టు నిర్దారణ చేసింది. ఈ కారణం చేత పెద్దపల్లి పద్మావతి జడ్పీటీసీ ఎన్నిక చెల్లదని ఎలెక్షన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ అంశంపై ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు చేపట్టనుందో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు జడ్పీ చైర్‌పర్సన్ పదవి చేపట్టే విషయమై మరోసారి జిల్లాలో ఆసక్తి నెలకొంది. పార్టీ వర్గాల్లో ఇదే విషయమై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. తరువాతి జడ్పీ చైర్ పర్సన్‌గా ఎవరిని ఎన్నుకుంటారనే విషయంపై టీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు.

First published:

Tags: Local News, Nagar kurnool, Politics, Telangana

ఉత్తమ కథలు